English   

ముద్దు అంత సింపులా తాప్సీ..?

taapsee pannu
2018-02-20 16:11:36

తాప్సీ.. తెలుగు ఇండ‌స్ట్రీ నుంచి బాలీవుడ్ కు వెళ్లిన బ్యూటీ. అదృష్టం బాగుంటే ఈ పాటికే అక్క‌డ చ‌క్రం తిప్పేది. కానీ విజ‌యాలున్నా అక్క‌డ ఆఫ‌ర్లు మాత్రం రావ‌ట్లేదు. వ‌చ్చిన అర‌కొర అవ‌కాశాల‌తోనే కాలం గ‌డిపేస్తుంది తాప్సీ. బాలీవుడ్ లో జెండా పాతడానికి.. ఎలాగైనా అక్క‌డే సెటిలైపోవ‌డానికి అవ‌స‌రం అనుకున్న అందాల అస్త్రాల‌న్నింటినీ వాడేస్తుంది ఈ భామ‌. ఇప్ప‌టికే అక్క‌డ లిప్ లాక్ సీన్స్.. బికినీలు కూడా వేసింది తాప్సీ. తాజాగా ముద్దు సీన్ గురించి లెక్చ‌ర్ ఇచ్చింది తాప్సీ. ముద్దు సీన్లు చేయ‌డం పెద్ద క‌ష్ట‌మేం కాదంటుంది ఈ భామ‌. దిల్ జంగ్లీ సినిమాలో ఈ ముద్దుగుమ్మ ముద్దుల్లో బాగానే మునిపోయింది. 
బాలీవుడ్ లో నిల‌బ‌డాలంటే ముద్దుల‌తో పాటు అందాలు ఆర‌బోయ‌డం కూడా త‌ప్ప‌నిస‌రి అని తెలుసుకుని ముందుగానే అన్నీ ప్రిపేర్ అవుతుంది తాప్సీ. ఫంక్ష‌న్ ఏదైనా అందాల ప్ర‌ద‌ర్శ‌న మాత్రం కామ‌న్. కెమెరా క‌ళ్లన్నీ త‌న‌పైనే ఉండేలా క్యాస్ట్యూమ్స్ డిజైన్ చేసుకుంటుంది ఈ భామ‌. కొంటె చూపుల‌తో అంద‌ర్నీ చంపేస్తుంది తాప్సీ. అందాల ప్ర‌ద‌ర్శ‌న‌లో ఈ భామ పిహెచ్ డీకి తాత‌ను పూర్తిచేసింది. కానీ అవ‌కాశాలే ముద్దుగుమ్మ‌ను చిన్న చూపు చూస్తున్నాయి. తెలుగులో ఎన్ని సినిమాలు చేసినా.. అమ్మ‌డుకు విజ‌యం మాత్రం వెక్కిరించింది. ప్ర‌స్తుతం బాలీవుడ్ లో దిల్ జంగ్లీ అనే సినిమా చేస్తుంది తాప్సీ. ఈ చిత్ర ట్రైల‌ర్ కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది.

చూస్తుంటే ఇప్పుడు తాప్సీ టాలీవుడ్ కు వ‌చ్చేలా క‌నిపించ‌ట్లేదు. గ‌తేడాది ఆనందో బ్ర‌హ్మతో తెలుగులో విజ‌యం ద‌క్కించుకున్నా అమ్మాయిగారి చూపులు మాత్రం బాలీవుడ్ పైనే ఉన్నాయి. బాలీవుడ్ లో అమ్మ‌డు న‌టించిన సినిమాల్లో 90 శాతం మంచి విజ‌య‌మే సాధించాయి. గ‌తేడాది వ‌చ్చిన జుడ్వా 2 కూడా 200 కోట్ల క్ల‌బ్ లో చేరింది. అయినా గానీ ఈ భామ‌ను ఎందుకో మ‌న ద‌ర్శ‌కులు, హీరోలు ప‌ట్టించుకోవ‌డం లేదు. దాంతో ఇదిగో ఇలా అప్పుడ‌ప్పుడూ హాట్ ఫోటోషూట్స్ తో ద‌ర్శ‌కుల మ‌దిలో ప‌డ‌టానికి ప్ర‌య‌త్నాలు చేస్తుంది. అస‌లే స‌న్న‌గా మెరుపుతీగ‌లా ఉండే తాప్సీ.. ఇప్పుడు మ‌రింత స‌న్న‌బ‌డింది తాప్సీ. దాంతో స‌న్నాజాజిలా పుట్టేసిందిరో అంటూ చిరంజీవి పాట పాడుకోవాల్సి వ‌స్తుంది ఈ ఢిల్లీ భామ‌ను చూస్తుంటే..! మ‌రి ఈ అందాల ప్ర‌ద‌ర్శ‌న‌తో తాప్సీ ఇంకెంత దూరం నెట్టుకొస్తుందో చూడాలిక‌..!

More Related Stories