English   

నితిన్ అందాదున్ రీమేక్ యూనిట్ కి షాకిచ్చిన సీనియర్ హీరోయిన్

nithin
2020-02-26 07:26:09

కుర్ర హీరో నితిన్‌ ప్రస్తుతం వరుస చిత్రాలని అనౌన్స్ చేసి మంచి ఫాంలో ఉన్నాడు. తాజాగా భీష్మతో సూపర్ హిట్ అందుకున్న ఈ హీరో భీష్మతో పాటే వెంకీ అట్లూరి, చంద్రశేఖర్‌ యేలేటి, కృష్ణ చైతన్యలతో సినిమాలు కూడా ఓకే చేశాడు. ఇక తాజాగా ఆయన మేర్లపాక గాంధీతో ‘అంధాదున్‌’ రీమేక్‌ కూడా పట్టాలెక్కించాడు. తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది. ఈ సినిమాలో విలన్‌ ఓ లేడీ. మాతృకలో ఈ పాత్రను టబు అద్భుతంగా నటించింది. అందుకే ఇప్పుడు తెలుగు రీమేక్‌లోనూ ఆ పాత్రను ఆమెతోనే చేయించాలని నితిన్ సినిమా యూనిట్ కూడా ప్రయత్నించినట్లు చెబుతున్నారు. అయితే ఈ పాత్ర చేయడానికి టబు కూడా అంగీకరించిందని కానీ, ఆమె అడిగిన రెమ్యునరేషన్ విన్నాకనే యూనిట్ షాకయిందని అంటున్నరు. ఎందుకంటే ఆమె ఈ పాత్ర చేయడానికి రూ.1కోటి డిమాండ్‌ చేసిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆమె మొన్ననే ‘అల వైకుంఠపురములో’ చిత్రంతో తెలుగులోకి రీఎంట్రీ ఇవ్వగా ఆ సినిమాకు దాదాపు రూ.2 కోట్ల పైన అందుకుందట. ఈ నేపథ్యంలో ఇప్పుడు ‘అంధాదున్‌’లోని ఈ పాత్ర కోసం రూ.కోటి డిమాండ్‌ చేసినట్లు చెబుతున్నారు. అందుకే ఆమె అంత అమౌంట్ ఇవ్వలేక వేరే ఆమెను ఆ పాత్రలో నటింపచేసే పనిలో పడ్డారట.

 

More Related Stories