English   

 మరో ‘ఐటమ్’ లో తమన్నా

Tamanna-Savyasaachi
2018-05-24 11:09:58

ఒకప్పుడు హీరోయిన్ గా క్రేజ్ తగ్గిన భామలు ఐటమ్ సాంగ్స్ చేసేవారు. కానీ ఇప్పుడు హీరోయిన్ గా సినిమాలు చేస్తూనే.. ఐటమ్ సాంగ్స్ చేస్తున్నారు. ట్రెండ్ మారిందంతే. ఈ ట్రెండ్ లో ఎప్పుడో ఎంటర్ అయిన బ్యూటీ తమన్నా. ఈ మిల్కీ బ్యూటీ ఐటమ్ సాంగ్స్ సై అని చాలాకాలమే అయింది. మొదటి సారిగా అల్లుడు శీను లోఆడిపాడిన ఈ మిల్కీ సోయగం.. ఇప్పుడు మరో ఐటమ్ కు సై అంది. అది కూడా తన ఫేవరెట్ కో స్టార్ తో కావడం విశేషం. పైగా తను చేస్తోంది ఓ రీమిక్స్ సాంగ్. ఇది కూడా ఒకప్పుడు సూపర్ హిట్ అయిన ఐటమ్ నంబరే. అప్పుడు చేసింది కూడా అప్పటి టాప్ హీరోయిన్నే.. ఇంతకీ ఈ సాంగ్ ఏంటో తెలుసా.. అక్కినేని నాగార్జున హీరోగా వచ్చిన అల్లరి అల్లుడు సినిమాలోని నిన్ను రోడ్డుమీద చూసినది లగాయితూ అనే సాంగ్ ఉంటుంది.. గుర్తుందా.. అప్పట్లో కాలేజ్ ఫంక్షన్ నేపథ్యంలో వచ్చే ఈ పాటలో హీరోయిన్ రమ్యకృష్ణ ఆడిపాడింది. అప్పటి సందర్భం ప్రకారం ఆ కాలేజ్ ఈ సినిమా తార గెస్ట్ గా వస్తుంది. అదే సాంగ్ ను ఇప్పుడు నాగచైతన్య రీమిక్స్ చేయబోతున్నాడు. చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సవ్యసాచి సినిమాలో ఈ ఐటమ్ రీమిక్స్ చేయబోతున్నారు. అప్పటి రమ్యకృష్ణగా ఇప్పుడు తమన్నా హల్చల్ చేయబోతోందన్నమాట. మామూలుగానే ఆ పాట మాస్ మసాలా సాంగ్ గా ఉంటుంది. ఇక ఈసారి కూడా ఆ మసాలా జోష్ కు తమ్మూ సోయగాలూ జతై ఈ పాటను మరింత హీటెక్కించబోతున్నాయి..  ఇక తమన్నాకు ఫస్ట్ బ్రేక్ వచ్చింది 100పర్సెంట్ లవ్ సినిమాతో. అప్పుడు జత చైతూ. తర్వాత ఈ ఇద్దరూ కలిసి తడాఖా అనే సినిమాలో నటించారు. ఇది కూడా బానే ఆడింది. సో.. ఆల్రెడీ ఇద్దరి మధ్యమంచి కెమిస్ట్రీ ఉంది కాబట్టి.. అది ఈ ఐటమ్ కుమరింత ఊపు తెస్తుందేమో.. 

More Related Stories