పాలరాతి శిల్పం అంటే ఇలానే ఉంటుదేమో తమన్నా...

ఇప్పుడు తమన్నాను చూస్తుంటే ఈ మాట తప్ప మరోటి ఎలా చెప్తాం చెప్పండి..? మరీ ఇంత తెల్లగా ఉందేంట్రా నాయనా అంటూ ఈ ఫోటోను చూసి పడిపోతున్నారు అభిమానులు. మీ చర్మ సౌందర్యానికి ఏం వాడుతున్నావ్ తమన్నా అంటూ సోషల్ మీడియాలో కామెంట్ కూడా చేస్తున్నారు ఫ్యాన్స్. అంతగా ఈమె అదిరిపోయే పోజిచ్చింది. పైగా ఈ మధ్య ఎక్కడికి వచ్చినా కూడా అందమే ఆయుధంగా వాడేస్తుంది తమన్నా. ఆ మధ్య ఐఫా ఉత్సవంలో ఈమె ఉల్లిపొర లాంటి డ్రస్సుతో చేసిన రచ్చ ఇప్పటికీ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ తర్వాత కూడా చాలా ఈవెంట్స్ లో ఊపిరి ఆగిపోయే అందాల ప్రదర్శనతో రెచ్చగొట్టింది తమన్నా. ఇక ఇప్పుడు మరోసారి రెచ్చిపోయింది ఈ భామ. ఈ మధ్యే ఫెమీనా వెడ్డింగ్ టైమ్స్ మ్యాగజైన్ కవర్ పేజీపై అమ్మడు చేసిన ఎక్స్ పోజింగ్ చూసి పై ప్రాణాలు పైనే పోయాయి. ఆ నడుము ఒంపులు చూస్తుంటే బాపురే అనుకోకుండా ఉండలేరు. తమన్నా సొగసులకు థర్మామీటర్ కూడా సైడ్ ఇచ్చేస్తుంది.
నడుము సోయగాలు చూపిస్తూ నిద్ర చెడగొట్టింది. ఇప్పుడు పాలరాతి శిల్పంలా మెరిసిపోతూ టైట్ డ్రెస్సులో కవ్వించింది తమన్నా. పైగా కాస్త ఒళ్ళు కూడా చేసింది ఈ మిల్కీ బ్యూటీ. ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇప్పట్నుంచీ ఒక లెక్క అన్నంతగా రెచ్చిపోయింది ఈ బ్యూటీ. కేవలం నడుము మాత్రమే చూపిస్తూ తమన్నా చేసిన హంగామాకు అక్కడున్న వాళ్ల మతులు చెడిపోయాయంతే. బాలీవుడ్ లోనూ తమన్నా హొయలు కనిపిస్తున్నాయి. అందుకే ఈ మధ్య అక్కడి వేడుకల్లో రెచ్చిపోయి మరీ అందాలు ఆరబోస్తుంది. బాహుబలి తర్వాత తమన్నాకు బాలీవుడ్ లోనూ మంచి ఇమేజ్ వచ్చేసింది. ఈ మధ్యే ఆఫర్లు కూడా వస్తున్నాయి. దాంతో ఎక్కడా తగ్గట్లేదు ఈ మిల్కీ బ్యూటీ. ప్రస్తుతం తెలుగులో ఎఫ్ 3 సినిమాతో పాటు మరో రెండు ప్రాజెక్టులలో వర్కవుట్ అయింది. మరోవైపు కామోషీ.. దటీజ్ మహాలక్ష్మి లాంటి సినిమాలతో బిజీగా ఉంది ఈ ముద్దుగుమ్మ. మధ్యలో ఇలా ఫోటోషూట్లు కూడా చేసి ఊపిరి తీస్తుంది తమన్నా.