English   

మాఫియాను బెదిరిస్తున్న త‌మ‌న్నా

Tamannaah Bhatia Taking Huge Remuneration For Special Song in Yash's KGF
2018-08-08 08:30:49

మాఫియా అనే ప‌దం విన‌గానే కిలోమీటర్ దూరం పరుగు తీస్తుంటారు చాలామంది. అలాంటిది అదే మాఫియాతో ఆడుకుంటుంది త‌మ‌న్నా. వీళ్ల నుంచి ల‌క్ష‌ల‌కు ల‌క్ష‌లు అందుకుంటుంది. ఇంత‌కీ ఈ భామ‌కు మాఫియాతో లింక్ ఏంట‌బ్బా అనుకుంటున్నారా..? అలా చూడ్డానికి బ‌క్క‌గా ఏం తెలియ‌ని అమాయ‌కురాలిగా క‌నిపిస్తుంది కానీ లోప‌ల మాత్రం త‌మ‌న్నా చాలా డేంజ‌ర్. ఈమె బ్యాగ్రౌండ్ కూడా అలాగే ఉంది మ‌రి. ఇన్నాళ్లూ అన్ని ఇండ‌స్ట్రీలు చుట్టినా కూడా ఎందుకో కానీ క‌న్న‌డలోకి వెళ్ల‌లేదు. ఇప్పుడు ఆ ముచ్చ‌ట కూడా తీర్చుకుంటుంది. అక్క‌డ ఐటం సాంగ్ చేస్తుంది ఈ భామ‌. కేజీఎఫ్ అనే సినిమాలో స్పెష‌ల్ సాంగ్ చేయ‌బోతుంది త‌మ‌న్నా. య‌శ్ హీరోగా న‌టిస్తోన్న ఈ చిత్ర బ‌డ్జెట్ 50 కోట్లు. ఇప్ప‌టి వ‌ర‌కు క‌న్న‌డ‌లో హైయ్య‌స్ట్ బ‌డ్జెట్ తో వ‌స్తోన్న సినిమా ఇదే. ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌కుడు.

మాఫియా డాన్ తంగం బ‌యోపిక్ గా ఈ చిత్రం వ‌స్తుంది. అలా మాఫియాకు బాగానే క‌నెక్ట్ అయిపోయింది మిల్కీబ్యూటీ. ఈ సినిమాలో ఐటం సాంగ్ కోసం ఏకంగా 75 ల‌క్ష‌లు తీసుకుంటుంది త‌మ‌న్నా. అక్క‌డ నిజానికి ఏ స్టార్ హీరోయిన్ కూడా అంత మొత్తం తీసుకోదు. అంతెందుకు ఇదే సినిమాలో హీరోయిన్ గా న‌టిస్తున్న శ్రీ‌నిధి శెట్టికి కూడా అంత ఇచ్చుండ‌రు. కానీ ఒకేఒక్క పాట కోసం త‌మ‌న్నా ఏకంగా 75 ల‌క్ష‌లు తీసుకుంటుంది. ఎంతైనా మాఫియా బ్యాక్ డ్రాప్ క‌దా.. నిల‌బెట్టి మ‌రీ వ‌సూలు చేస్తుంది. త‌మ్మూ ఐటం సాంగ్ సినిమాకు ప్ల‌స్ అవుతుంద‌ని భావిస్తున్నాడు ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్. ఇదివ‌ర‌కు జాగ్వార్ లో నిఖిల్ గౌడ‌తో చేసిన స్పెష‌ల్ సాంగ్ కు కూడా 80 ల‌క్ష‌ల వ‌ర‌కు తీసుకుంది ఈ ముద్దుగుమ్మ‌.

More Related Stories