English   

 త‌మ‌న్నాకు అంత ఇచ్చారా..? 

Naa-nuvve

త‌మ‌న్నా ఇప్పుడు స్టార్ హీరోయినా అని అడిగితే స‌మాధానం చెప్ప‌డానికి కాస్త ఆలోచించాలి. అవును అని చెప్పాలా లేదంటే కాద‌నాలా అని. దీనికి కార‌ణం కూడా లేక‌పోలేదు. ఒక‌ప్ప‌ట్లా ఇప్పుడు త‌మ‌న్నాకు అవ‌కాశాలు లేవు. అది ఒప్పుకోవాల్సిన నిజం. ఎందుకంటే ఇప్ప‌టికే ఇండ‌స్ట్రీకి వ‌చ్చి 13 ఏళ్లు దాటిపోయింది. స్టార్ హీరోలంద‌రితోనూ న‌టించేసింది.. ఇక ఇప్పుడు సీనియర్ హీరోలు మాత్ర‌మే బాకీ. ఇన్నాళ్లూ కేవ‌లం కుర్రాళ్ళ‌తో న‌టిస్తూ వ‌చ్చిన త‌మ‌న్నా ఇప్పుడు వెంక‌టేశ్, చిరంజీవి అంటుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు త‌మ‌న్నా పారితోషికం కూడా కోటి లోపే ఉంది. కానీ ఇలాంటి టైమ్ లో కూడా ఓ సినిమా కోసం ఈమె 2 కోట్ల‌కు పైగా రెమ్యున‌రేష‌న్ అందుకుంద‌ని తెలుస్తుంది. అదే నా నువ్వే. క‌ళ్యాణ్ రామ్ హీరోగా జ‌యేంద్ర తెర‌కెక్కించిన ఈ చిత్రం త్వ‌ర‌లోనే విడుద‌ల కానుంది. మే 25 అనుకున్నా ఆ తేదీ నుంచి వాయిదా ప‌డింది. ఇందులో నటించ‌డానికి ఈ భామ‌కు ఏకంగా 2 కోట్ల పారితోషికం అందింద‌ని తెలుస్తుంది. నిజంగా ఇప్పుడు త‌మ‌న్నా ఉన్న ప‌రిస్థితుల్లో అంతివ్వ‌డం మాత్రం గొప్ప విష‌య‌మే. ఏదేమైనా అంతా నంద‌మూరి వార‌సుడి మ‌హిమ‌. మ‌రి చూడాలిక‌.. ఈ చిత్రంలో త‌మ‌న్నా-క‌ళ్యాణ్ రామ్ జోడీ ఎలా ఉండ‌బోతుందో..? 

More Related Stories