English   

క్వీన్ వెన‌క అంత క‌థ జ‌రిగిందా..? 

Tamannaah
2018-12-05 12:43:02

క్వీన్ సినిమా తెలుగులో రీమేక్ చేయాల‌ని చాలా కాలంగా అనుకుని.. అనుకుని చివ‌రికి త‌మ‌న్నాతో చేస్తున్నారు. ఇప్పుడు ద‌టీజ్ మ‌హాల‌క్ష్మిగా తెలుగులో వ‌స్తుంది ఈ చిత్రం. ప్ర‌శాంత్ వ‌ర్మ ద‌ర్శ‌కుడు. అ.. సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న ఈయ‌న రెండో సినిమాతోనే త‌మ‌న్నాను డైరెక్ట్ చేసే అవ‌కాశం అందుకున్నాడు. అయితే ఈ చిత్రం ముందు నీల‌కంఠ చేతుల్లో ఉంది. ఆయ‌న వ‌ద్ద‌న్న త‌ర్వాత కాదు కాదు త‌ప్పుకున్న త‌ర్వాత క్వీన్ తెలుగు రీమేక్ ప్ర‌శాంత్ చేతికి వ‌చ్చింది. అయితే అస‌లు ఎందుకు నీల‌కంఠ త‌ప్పుకోవాల్సి వ‌చ్చింద‌నేది మాత్రం ఇప్ప‌టికీ స‌స్పెన్సే. అయితే దీనికి కార‌ణం త‌మ‌న్నా ఆటిట్యూడ్ అని తెలుస్తుంది. ఆమె త‌న‌ను తాను ఎక్కువ‌గా ఎక్స్ పోజ్ చేసుకుని ద‌ర్శ‌కుడిపై చిందులు వేయ‌డంతోనే ఆయ‌న మ‌న‌స్తాపంతో త‌ప్పుకున్నాడ‌ని తెలుస్తుంది. సెట్ లో కూడా అంద‌రి ముందు సీనియ‌ర్ ద‌ర్శ‌కుడు అనే మ‌ర్యాద కూడా లేకుండా త‌మ‌న్నా చాలా దురుసుగా ప్ర‌వ‌ర్తించింద‌ని ఆ యూనిట్ స‌భ్యులే బ‌య‌ట గుస‌గుస‌లాడుకుంటున్నారు. 

త‌మ‌న్నా ఇలా చెల‌రేగిపోవ‌డం ఇదే తొలిసారి కాదు. ప్రెస్ మీట్ ఉన్న‌పుడు కూడా టైమ్ కు రాద‌నే విమ‌ర్శ‌లు త‌మ‌న్నాపై ఉన్నాయి. మొన్న‌టికి మొన్న నెక్ట్స్ ఏంటి ప్రెస్ మీట్ కు కూడా అనుకున్న టైమ్ కంటే రెండు గంట‌లు ఆల‌స్యంగా రావ‌డ‌మే కాకుండా స‌మాధానాలు కూడా స‌రిగ్గా ఇవ్వ‌లేద‌ని ఫైర్ అయ్యారు మీడియా వ‌ర్గాలు. అయితే త‌మ‌న్నా మాత్రం అవ‌న్నీ ప‌ట్టించుకోకుండా వ‌చ్చిన ప‌ని చేసుకుని వెళ్లిపోయింది. ఇక క్వీన్ రీమేక్ విష‌యానికొస్తే త‌మ‌న్నా దూకుడు త‌ట్టుకోలేక‌.. త‌ను అంత స్పీడ్ గా ప‌నిచేయ‌లేక నీల‌కంఠ త‌ప్పుకున్నాడ‌నే వార్త‌లు ఉన్నాయి. ఆ స‌మ‌యంలో చేసేదేం లేక ప్ర‌శాంత్ వ‌ర్మ వ‌చ్చాడు. అయితే ఈ కుర్ర ద‌ర్శ‌కుడి ద‌గ్గర కూడా త‌మ‌న్నాకు స‌మ‌స్య‌లు వ‌చ్చినా కూడా బాగానే హ్యాండిల్ చేసాడ‌ని తెలుస్తుంది. మ‌రి చూడాలిక‌.. ఈ చిత్రం తెలుగులో ఎంత వ‌ర‌కు వ‌ర్క‌వుట్ అవుతుందో..? 

More Related Stories