English   

మాట నిల‌బెట్టుకున్న చిరంజీవి..

tamanna-chiru
2018-04-17 14:07:01

అవును.. ఈ రోజుల్లో నిన్న ఇచ్చిన మాట‌నే నిల‌బెట్టుకోలేక చేతులెత్తేస్తున్నారు. కానీ చిరంజీవి మాత్రం ఎప్పుడో ఆరేళ్ల కింద ఇచ్చిన మాట‌ల‌ను ఇప్ప‌టికీ గుర్తు పెట్టుకున్నాడు. ఆ మాట‌నే ఇప్పుడు నెర‌వేర్చాడు కూడా. అది కూడా త‌మ‌న్నా విష‌యంలో. ఇది ఇప్ప‌టి మాట కాదు. 2012లో ర‌చ్చ ఆడియో వేడుక‌లో జ‌రిగిన ముచ్చ‌టిది. అప్ప‌ట్లో వానా వానా పాట చూసి త‌మ‌న్నాకు ఫిదా అయిపోయాడు మెగాస్టార్. తాను కానీ 150వ సినిమా చేస్తే క‌చ్చితంగా త‌మ‌న్నాకే చాన్స్ ఇస్తాన‌ని చెప్పాడు చిరు. అన్న‌ట్లుగా 150వ సినిమాలో అవ‌కాశం ఇవ్వ‌లేదు కానీ ఇప్పుడు 151వ సినిమాలో మాత్రం ఆఫ‌ర్ ఇస్తున్నాడు. అవును.. త‌మ‌న్నా సైరాలో కీల‌క‌పాత్ర‌లో న‌టించ‌బోతుంది. ఈ విష‌యాన్ని త‌నే క‌న్ఫ‌ర్మ్ చేసింది కూడా. సైరాలో త‌మ‌న్నా ఎంట్రీతో ఆమె కొత్త రికార్డ్ ఒక‌టి సృష్టించింది. ఇప్ప‌టికే మెగా కుటుంబంలో చ‌ర‌ణ్ తో ర‌చ్చ‌లో.. బ‌న్నీతో బ‌ద్రీనాథ్ లో.. కెమెరామెన్ గంగ‌తో రాంబాబులో ప‌వ‌న్ తో న‌టించింది త‌మ‌న్నా. ఇప్పుడు చిరంజీవి సైరాలో ఆఫ‌ర్ వ‌చ్చింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ రికార్డ్ కాజ‌ల్ కు మాత్ర‌మే ఉంది. రామ్ చ‌ర‌ణ్ మ‌గ‌ధీర‌తోనే స్టార్ హీరోయిన్ అయిన చంద‌మామ‌.. త‌ర్వాత బ‌న్నీతో ఆర్య 2లో రొమాన్స్ చేసింది. ఆ వెంట‌నే ఎవ‌డు.. నాయ‌క్.. గోవిందుడు అంద‌రివాడేలే సినిమాల్లో చ‌ర‌ణ్ తో న‌టించింది. ఇక స‌ర్దార్ లో తొలిసారి ప‌వ‌ర్ స్టార్ తో కూడా న‌టించింది. ఖైదీ నెం.150లో చిరంజీవితో రొమాన్స్ చేసి మెగా ఫ్యామిలీలో ఆ న‌లుగురుతో న‌టించిన ముద్దుగుమ్మ‌గా చ‌రిత్ర సృష్టించింది కాజ‌ల్. ఇప్పుడు త‌మ‌న్నా కూడా ఇదే రికార్డును అందుకుని లెక్క స‌మం చేసింది. మ‌రి సైరాలో త‌మ్మూ రోల్ ఎలా ఉండ‌బోతుందో చూడాలిక‌..!

More Related Stories