English   

త‌మ‌న్నా.. తీరిందిగా ఈ త‌మ‌న్నా..!

Tamannaah-Trying-Her-Luck-In-Bollywood
2017-05-06 00:15:16

తెలుగు, త‌మిళ్ ఇండ‌స్ట్రీల్లో స్టార్ హీరోయిన్. ఇక్క‌డ ఎంత అడిగితే అంత ఇచ్చే నిర్మాత‌లున్నారు. పైగా అందాల ఆర‌బోత‌లోనూ త‌మ‌న్నాకు పెద్ద‌గా అడ్డూ అదుపుల్లేవు. దాంతో ఈ భామ ఆడిందే ఆట‌.. పాడిందే పాట‌. కానీ ఏం చేస్తాం.. సొంత ఇండ‌స్ట్రీలో బాలీవుడ్ లో మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కు త‌మ‌న్నా కోరిక మాత్రం తీర‌లేదు. అక్క‌డ స్టార్ గా వెలిగిపోవాల‌నే త‌మ‌న్నా కోరిక ఇప్ప‌టికీ కోరిక‌గానే మిగిలిందే గానీ ఒక్క‌టంటే ఒక్క బ్రేక్ కూడా రాలేదు. ఇన్నాళ్ల‌కు త‌మ‌న్నా బాలీవుడ్ లో బిజీ కాబోతుంది.

బాహుబ‌లితో హిందీలోనూ తొలిసారి గెలుపు రుచి చూసింది త‌మ‌న్నా. ఈ సినిమా విజ‌యంతో అక్క‌డ కూడా మంచి ఇమేజ్ సంపాదించుకుంది. హ‌మ్ ష‌క‌ల్స్, హిమ్మ‌త్ వాలా లాంటి డైరెక్ట్ హిందీ సినిమాలు తీసుకురాని విజ‌యాన్ని బాహుబ‌లి తీసుకొచ్చింది. బాలీవుడ్ లో ప్ర‌స్తుతం త‌మిళ సినిమా కొలైయుదుర్ కాలం రీమేక్ లో న‌టిస్తుంది త‌మ‌న్నా. త‌మిళ‌నాట న‌య‌న‌తార చేస్తోన్న‌ పాత్ర‌లో అక్క‌డ త‌మ‌న్నా న‌టిస్తోంది. వ‌ర‌స హ‌త్య‌ల నేప‌థ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు ద‌ర్శ‌కుడు చ‌క్రి తోలేటి. దీంతోపాటు మ‌రో సినిమాలో కూడా న‌టిస్తుంది త‌మ‌న్నా. మొత్తానికి ఇన్నాళ్ల‌కి బాలీవుడ్ లో బిజీ అవుతుంది ఈ మిల్కీబ్యూటీ.

More Related Stories