English   

స్టార్ కమెడియన్ కు గుండెపోటు..పరిస్థితి విషమం

Tamil actor Vivek
2021-04-16 13:40:47

తమిళ స్టార్ కమెడియన్ వివేక్ అనారోగ్యానికి గురయ్యారు. శుక్రవారం గుండెపోటు రావడంటతో  ఆయన ఆస్పత్రిలో చేరారు. వివేక్ గురువారం ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఓ ట్వీట్ కూడా చేసారు. కరోనా నుండి రక్షించుకోవాలంటే కేవలం వ్యాక్సిన్ తీసుకోవడం ఒక్కటే మార్గమని ఆయన ట్వీట్ లో పేర్కొన్నారు. ఆ మరుసటి రోజే ఆయనకు హార్ట్ ఎటాక్ రావడం ఆందోళన కలిగిస్తోంది. అయితే హార్ట్ ఎటాక్ రావడానికి వ్యాక్సిన్ తీసుకోవడానికి మధ్య ఏమైనా సంబంధం ఉందా అన్నది తెలియాల్సి ఉంది. 

ఇదిలా ఉండగా వివేక్ ప్రస్తుతం తమిళ్ లో స్టార్ కమెడియన్ గా ఉన్నారు. ఎన్నో తమిళ చిత్రాల్లో నటించి ఆయన నవ్వులు పూయించారు. అంతే కాకుండా తెలుగు వారికి సైతం ఆయన సూపరిచితులే. సింగం సినిమాలో సూర్య పక్కన పోలీస్ గా నటించి అలరించారు. అంతే కాకుండా తెలుగులో డబ్ అయిన ఎన్నో సినిమాల్లో వివేక్ కనిపించారు. కానీ సింగం సినిమాతో ఆయన తెలుగు ప్రేక్షకులకు గుర్తుండిపోయారు. ఇక వివేక్ ఆస్పత్రిలో చేరడం తో ఆయన త్వరగా కోలుకుని సాధారణ స్థితికి రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.

More Related Stories