English   

త‌మిళ ఇండ‌స్ట్రీ బంద్.. ఎఫెక్ట్ ప‌డుతుందా..? 

Tamil-film-industry-bandh
2018-03-12 12:22:12

ఏమైందో ఏమో కానీ ఇప్పుడు ఇండ‌స్ట్రీల‌న్నీ బంద్ లా బాటలో న‌డుస్తున్నాయి. మొన్న వారం రోజులు ద‌క్షిణాదిన అన్ని థియేట‌ర్స్ బందయ్యాయి. మార్చ్ 9 నుంచి మ‌ళ్లీ స్క్రీన్స్ ఓపెన్ అయ్యాయి. ఇలా రెండు రోజులు అయిందో లేదో ఇప్పుడు త‌మిళ‌నాట థియేట‌ర్స్ బంద్ కే కాదు.. ఇండ‌స్ట్రీ బంద్ చేయాల‌ని పిలుపిచ్చాడు విశాల్. ఈయ‌న ఇండ‌స్ట్రీ మంచి కోస‌మే ఇది చేస్తున్నాన‌ని చెబుతున్నాడు. నిర్మాత‌ల మండలి అధ్య‌క్షుడిగా వాళ్ల బాగు కోసం ఎంత దూర‌మైనా వెళ్తానంటున్నాడు ఈ హీరో. విశాల్ చేస్తోన్న ప‌ని అర్థం చేసుకుని త‌మిళ ఇండ‌స్ట్రీ కూడా స‌హ‌క‌రించ‌డానికి రెడీ అయింది. 

మార్చ్ 16 నుంచి త‌మిళ ఇండ‌స్ట్రీ అంతా స్థంభించిపోనుంది. విశాల్ తో పాటు ఈ పోరులో ప్ర‌కాశ్ రాజ్ కూడా ఉన్నారు. ఇద్ద‌రూ క‌లిసే టోట‌ల్ బంద్ అనౌన్స్ చేసారు.  ఈ బంద్ నుంచి ఇప్ప‌టికే తెలుగు ఇండ‌స్ట్రీ ప‌క్క‌కు త‌ప్పుకుంది. కానీ త‌మిళ వాళ్ల‌కు మాత్రం వాళ్ల డిమాండ్స్ ఇంకా తీర్చ‌లేద‌నే ఫీలింగ్ లోనే ఉన్నారు. దాంతో త‌మిళ్ కు తోడుగా క‌న్న‌డ ఇండ‌స్ట్రీ కూడా రానుంది. తెలుగు మిన‌హా మూడు ఇండ‌స్ట్రీలు క‌లిసి ఈ బంద్ ను స‌క్సెస్ ఫుల్ చేయాల‌ని చూస్తున్నాయి. ఇందులో భాగంగానే మార్చ్16 నుంచి సినిమాలకు సంబంధించి ఏ ఒక్క కార్యక్రమం కూడా త‌మిళ ఇండ‌స్ట్రీలో జరగదు కాక జరగదని విశాల్ చెప్పేసాడు. షూటింగ్ లు.. రికార్డింగ్ లు.. డబ్బింగ్ లు.. ఇలా ఏ సినిమా కార్యక్రమం కూడా జరగదని విశాల్ ప్రకటించడంతో విష‌యం మ‌రో రేంజ్ కి వెళ్ల‌డం ఖాయ‌మైపోయింది. 

త‌మిళ‌నాట ప‌నులు ఆగిపోతే మ‌న సినిమాల‌కు కూడా ప్ర‌భావం త‌ప్ప‌దు. ఎందుకంటే ఇప్ప‌టికీ దేవీ, థ‌మ‌న్ ల స్టూడియోలు చెన్నైలోనే ఉన్నాయి. అక్క‌డ్నుంచే వాళ్లు రీ రికార్డింగ్ చేస్తారు. ఇప్పుడు కానీ అక్క‌డ బంద్ చేసారంటే స‌మ్మ‌ర్ లో విడుద‌ల అవ్వా ల్సిన సినిమాల‌కు ఎఫెక్ట్ ప‌డ‌క త‌ప్ప‌దు. వారం రోజులు అలా మూసేయ‌గానే మ‌ళ్లీ చ‌ర్చ‌లు జ‌రిపి థియేట‌ర్స్ తెరుచుకున్నారు తెలుగులో. ఈ విష‌యంపై నారాయ‌ణ మూర్తి లాంటి పెద్దోళ్లు కూడా సీరియ‌స్ అయ్యారు. ఎందుకు బంద్ చేసారు.. ఎందుకు ఆపేసారంటూ ఫైర్ అయ్యారాయ‌న‌. ఇలాంటి టైమ్ లో మ‌రి త‌మిళ ఇండ‌స్ట్రీకి మ‌నోళ్లు కూడా స‌పోర్ట్ చేస్తారా.. లేదంటే త‌మ దారి త‌మ‌దే అని ఊరుకుంటారా అనేది చూడాలిక‌..!

More Related Stories