English   

త‌మ‌న్నా డోస్ కాస్త ఎక్కువైన‌ట్లుందిగా..!

ఏ హీరోతో న‌టించినా ముందు ఆ హీరోకు క్లోజ్ అయిపోతుంది త‌మ‌న్నా. వ‌రుణ్ సందేశ్ తో న‌టించినా.. మ‌హేశ్ బాబుతో న‌టించినా.. ముందు త‌ను ఫ్రీ అయిపోతుంది. కొత్త కాంబినేష‌న్ అనే థాట్ కూడా రానివ్వ‌దు ఈ మిల్కీబ్యూటీ. ఇప్పుడు నా నువ్వే చూస్తుంటే కూడా ఇదే అనిపిస్తుంది. క‌ళ్యాణ్ రామ్ తో తొలిసారి న‌టించిన ఈ ముద్దుగుమ్మ‌.. కెమిస్ట్రీలో మాత్రం పిహెచ్డీ చేసింది. ఇదివ‌ర‌కే ప‌ది సినిమాలు క‌లిసి చేసారేమో అనేంత‌గా క‌ళ్యాణ్ తో న‌ట‌న‌లో క‌మిట్ అయిపోయింది త‌మ‌న్నా.
2018-06-12 01:13:01

ఏ హీరోతో న‌టించినా ముందు ఆ హీరోకు క్లోజ్ అయిపోతుంది త‌మ‌న్నా. వ‌రుణ్ సందేశ్ తో న‌టించినా.. మ‌హేశ్ బాబుతో న‌టించినా.. ముందు త‌ను ఫ్రీ అయిపోతుంది. కొత్త కాంబినేష‌న్ అనే థాట్ కూడా రానివ్వ‌దు ఈ మిల్కీబ్యూటీ. ఇప్పుడు నా నువ్వే చూస్తుంటే కూడా ఇదే అనిపిస్తుంది. క‌ళ్యాణ్ రామ్ తో తొలిసారి న‌టించిన ఈ ముద్దుగుమ్మ‌.. కెమిస్ట్రీలో మాత్రం పిహెచ్డీ చేసింది. ఇదివ‌ర‌కే ప‌ది సినిమాలు క‌లిసి చేసారేమో అనేంత‌గా క‌ళ్యాణ్ తో న‌ట‌న‌లో క‌మిట్ అయిపోయింది త‌మ‌న్నా. ముఖ్యంగా ఇప్పుడు విడుద‌లైన ప్రోమోస్ లో గ్లామ‌ర్ డోస్ కాస్త ఎక్కువైన‌ట్లు కూడా అనిపిస్తుంది. బావ బావ అంటూ క‌ళ్యాణ్ రామ్ తో బాగానే ఆడుకుంది ఈ భామ‌. టీజ‌ర్స్ లో ఇది కాస్త ఓవ‌ర్ అనిపిస్తున్నా కూడా సినిమాలో ఈ ఇద్ద‌రి కెమిస్ట్రీ ఇంకెలా ఉండ‌బోతుందో ఈ చిన్న టీజ‌ర్ తెలుపుతుంది. మొత్తానికి గ్లామ‌ర్ డోస్ లో కూడా ఎక్క‌డా త‌గ్గ‌లేదు త‌మ‌న్నా. సాల్సా పేరుతో బాగానే అందాల‌న్నీ ఆర‌బోసింది ఈ మిల్కీబ్యూటీ. 

More Related Stories