English   

అందుకే క్షమాపణలు చెబుతున్నా ..తనికెళ్ళ భరణి

Tanikella Bharani
2021-04-16 11:43:00

టాలీవుడ్ న‌టుడు త‌నికెళ్ల భ‌ర‌ణి తాను సోష‌ల్ మీడియాలో పెట్టిన ఓ పోస్ట్ కు సంబంధించి క్షమాప‌ణ‌లు చెప్పారు. ఇంతకీ త‌నికెళ్ల భ‌ర‌ణి ఏమ‌ని పోస్ట్ పెట్టారు..ఎందుకు క్ష‌మాప‌ణ‌లు చెప్పాల్సి వ‌చ్చింద్దంటే. కొద్ది రోజులుగా ఆయ‌న సోష‌ల్ మీడియాలో శ‌భాష్ రా శంక‌రా పేరుతో పోస్టులు పెడుతున్నారు. అయితే అందులో వాడిన కొన్ని ప‌దాల‌పై నెగిటివ్ కామెంట్లు వ‌చ్చాయి. దాంతో వివ‌ర‌ణ ఇస్తూ క్ష‌మాణ‌లు చెబుతూ ఓ వీడియోను పోస్ట్ చేశారు. 

ఈ వీడియోలో త‌న‌కు ఎవ‌రిని నొప్పించే హ‌క్కు లేద‌ని..తాను ఎవ‌రికీ వ్య‌తిర‌కం కాద‌ని ఆయ‌న అన్నారు. గ‌త కొద్ది రోజులుగా శ‌భాష్ రా శంక‌రా పేరుతో సోష‌ల్ మీడియాలో పోస్టులు పెడుతూ వ‌స్తున్నా..అయితే ఆ పోస్టులు కొంత మందిని నొప్పించాయ‌ని నా దృష్టికి వ‌చ్చింది. అయితే దానికి నేను వివ‌ర‌ణ ఇచ్చుకోద‌లుచుకోలేదు. అంతే కాకుండా ఆ పోస్టుల‌ను కూడా తొల‌గించాను. నాకు తువాదుల‌న్నా...మాన‌వ‌తావాదుల‌న్నా గౌర‌వ‌మే త‌ప్పితే వ్య‌తిరేకం కాదు. అలాగే ఏ మ‌నిషినీ నొప్పించే అధికారం హ‌క్కు ఏ ఒక్కరికీ లేవు అందుకే జ‌రిగిన పొర‌పాటుకు క్ష‌మించమ‌ని కోరుతున్నాన‌ని చెప్పారు. ఇదిలా ఉండ‌గా త‌నికెళ్ల భ‌రణి విభిన్న పాత్ర‌ల్లో న‌టిస్తూ మెప్పిస్తారు. నెగ‌టివ్ రోల్స్ తో పాటు ఆయ‌న కామెడీ పాత్ర‌ల్లోనూ అవ‌లీల‌గా న‌టిస్తుంటారు.
 

More Related Stories