English   

రకుల్ సినిమాలో రేపిస్ట్....ఫైర్ రేపుతున్న బాలయ్య హీరోయిన్

rakul
2019-04-18 21:12:54

ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చినట్టు, బాలీవుడ్ లో ఎలా అయినా పాగా వేయాలని చూస్తున్న రకుల్ ఆశలను తను శ్రీ దత్తా పాడు చేసేలా కనిపిస్తోంది. అదేంటి రకుల్ ని ఆమె ఏమి చేసింది అనుకుంటున్నారా ? రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ బాలీవుడ్‌లో నటిస్తోన్న 'దే దే ప్యార్‌ దే' సినిమా వచ్చే నెలలో విడుదలకు సిద్ధమవుతోంది. అజయ్‌ దేవగన్‌ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. అయితే, ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో అలోక్‌ నాథ్‌ అనే సీనియర్‌ బాలీవుడ్‌ నటుడు కూడా నటిస్తున్నాడు. ఇప్పుడు ఆయన వలనే సినిమా మీద నెగటివ్ టాక్ తెప్పించేలా ఉంది తను శ్రీ దత్తా. గతంలో తన మీద నటుడు అలోక్‌ నాథ్‌ లైంగిక వేధింపులకు పాల్పడినట్టు ప్రముఖ రచయిత్రి వింటా నందా ఆరోపించారు. కేసు కూడా నమోదు చేశారు. ఈ నేపథ్యంలో దేవగన్‌ నటిస్తున్న 'దే దే ప్యార్‌ దే'లో ఆలోక్‌ ని తీసుకోవడం పట్ల తను శ్రీ దత్తా అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. అలోక్‌ నాథ్‌ మీద గతంలో ఓ మహిళ ఆరోపణలు చేసినప్పటికీ అతన్ని ఎందుకు తీసుకున్నారు.? అలోక్‌ చేసింది తప్పు అని తెలిసినప్పుడు అతను నటించిన సన్నివేశాలను తొలగించి మరో నటుడ్ని పెట్టుకోవచ్చు. కానీ రేపిస్టుని సినిమాలో పెట్టుకుంటారా? అలోక్‌కి మళ్ళీ అవకాశం ఇచ్చింది అజయ్ నే. అంటే ఆయన రేపిస్టుకి మద్దతు ఇస్తున్నట్టేనా?' అని ఆమె ప్రశ్నించింది. ఇక తనుశ్రీ తెలుగులో బాల కృష్ణతో ఓకే సినిమా చేసింది. అదే వీరభద్ర.

 

More Related Stories