English   

త‌రుణ్ త‌డ‌బ‌డినా.. కామెడీ నిల‌బెట్టింది..!

Ee-Nagaraniki-Emaindi

ఎప్పుడైనా ఓ సినిమా విడుద‌లైతే ముందు అడిగే ప్ర‌శ్న ఎలా ఉంది.. ఆ త‌ర్వాత అడిగే ప్ర‌శ్న క‌థేంటి అని. ఇప్పుడు ఈ న‌గ‌రానికి ఏమైందికి మాత్రం కేవ‌లం తొలి ప్ర‌శ్న మాత్ర‌మే అడ‌గాలి. ఎందుకంటే ఈ చిత్రంలో క‌థ లేదు.. కేవ‌లం కామెడీ మాత్ర‌మే ఉంది. పెళ్లిచూపులు సినిమాకు ప‌క‌డ్బంధీ క‌థ రాసుకున్నాడు ద‌ర్శ‌కుడు త‌రుణ్ భాస్క‌ర్. తొలి సినిమా కాబ‌ట్టి ఎన్నో ఏళ్లుగా క‌ల‌లు కంటూ రాసుకున్న స్క్రిప్ట్ అది. అందుకే అందులో ఎమోష‌న్స్ సెంటిమెంట్ తో పాటు కామెడీ కూడా ఉంది. కానీ రెండో సినిమాకు వ‌చ్చేస‌రికి అవేవీ లేవు. ఉన్న‌ద‌ల్లా కామెడీ ఒక్క‌టే. ప్ర‌తీ సీన్ ఎలా న‌వ్వించాలి అని మాత్ర‌మే ఆలోచించాడు త‌రుణ్ భాస్క‌ర్. దానికితోడు తెలంగాణ యాస ఈయ‌న్ని బ‌తికించింది. ఇది రెండో సినిమా వ‌ర‌కు ఓకే కానీ ప్ర‌తీసారి ఇలాగే క‌థ లేకుండా కేవ‌లం కామెడీ చేస్తానంటే మాత్రం కుద‌ర‌ని ప‌ని. ఒక్క‌సారి మంచోళ్లు ప్రేక్ష‌కులు కానీ రెండోసారి మ‌రో అనుమానం లేకుండా బ‌య‌టికి తోసేస్తారు. అందుకే ఇప్పుడు మూడో సినిమాపై క‌చ్చితంగా త‌రుణ్ భాస్క‌ర్ బుర్రలో హీట్ పెంచుకోవాల్సిందే. క‌చ్చితంగా ఈ సారి క‌థ‌తో రాక‌పోతే అంద‌ర్లాగే త‌రుణ్ పై కూడా విమ‌ర్శ‌ల జల్లు త‌ప్ప‌దు. మ‌రి చూడాలిక‌.. ఈ కుర్ర ద‌ర్శ‌కుడు మూడో సినిమాలో ఎలాంటి క‌థ‌తో వ‌స్తాడో..? 

More Related Stories