English   

పెళ్లి చూపులు దర్శకుడికి ఇది పరీక్షా కాలం

Tarun-Bhaskar
2018-06-28 18:46:30

పెళ్లి చూపులుతో ఓవర్ నైట్ ఫేమ్ అయిన దర్శకుడు తరుణ్ భాస్కర్. చినుకులా మొదలైన ఈ సినిమా ప్రస్థానం జడివానగా మారింది. ఎవరో తెలియని సినిమాగా వచ్చి.. ప్రతి ఒక్కరికీ నచ్చిన సినిమాగా మిగిలింది. సింపుల్ స్టోరీ.. నేచురల్ స్క్రీన్ ప్లే..  కంప్లీట్ తెలంగాణ స్లాంగ్ పెళ్లి చూపులుకు బిగ్గెస్ట్ ప్లస్. ఆ సినిమా తర్వాత దర్శకుడు తరుణ్ భాస్కర్ కు చాలా ఆఫర్స్ వచ్చినా.. మళ్లీ కొత్త కుర్రాళ్లతోనే ఈ నగరానికి ఏమైంది అనే సినిమాతో వస్తున్నాడు. పెళ్లి చూపులుకు నిర్మాత కోసం చాలా ఇబ్బందులు పడ్డ తరుణ్ కు ఈ సారి సురేష్ బాబు అండ దొరికింది. అందుకే రేపు చాలా సినిమాలున్నా.. ధైర్యం చేసి బరిలోకి దిగుతున్నారు. అయితే ఇక్కడే ఉంది అసలు కిటుకు.

ఇప్పటి వరకూ మోస్ట్ టాలెంటెడ్ అనిపించుకున్న మన దర్శకుల్లో చాలామంది ద్వితీయవిఘ్నం దాటలేకపోయినవారే. అంటే ఫస్ట్ మూవీ బ్లాక్ బస్టర్ అయినా.. రెండో సినిమాతో డిజాస్టర్స్ చూసిన వారు ఎక్కువ. ఈ ట్రెండ్ ఈ మధ్య కాస్త తగ్గినా.. తరుణ్ కు మాత్రం ఇది పరీక్షా కాలం అనే చెప్పాలి. రెండో సినిమా గండం దాటితే ఇక మనోడికి తిరుగుండదు. అంటే మరో నాలుగైదు సినిమాల వరకూ బిజీగానే ఉంటాడు. కానీ ఈ నగరం ఏమాత్రం ఆకట్టుకోకపోయినా.. ఫస్ట్ మూవీకి అతనికి వచ్చిన పేరంతా చెడిపోతుంది. కాకపోతే తరుణ్ మాత్రం పెళ్లి చూపులు కంటే ఈ సినిమాపైనే తనకు ఎక్కువ నమ్మకం ఉందంటున్నారు. బట్..ట్రైలర్ చూస్తే ఇది అన్ని వర్గాలను ఆకట్టుకునేలా లేదు. కంటెంట్ కూడా షార్ట్ ఫిలిమ్ మేకర్స్ చుట్టూ తిరుగుతుందంటున్నారు. ఇది కేవలం బిగ్ సిటీస్ కు మాత్రమే తెలిసిన వ్యవహారం. ఆర్బన్, రూరల్ ఆడియన్ కు ఈ కంటెంట్ ఎంత వరకు ఎక్కుతుందనేది ప్రశ్నే. అలాగే కేవలం యూత్ ను మాత్రమే టార్గెట్ చేస్తే ఏ దర్శకుడూ గొప్పోడు అనిపించుకోడు. ఏదేమైనా సినిమా బావుంటే యూత్ దాటిన వారు కూడా వస్తారు. ఆ మేరకు తరుణ్ భాస్కర్ మెప్పిస్తాడనే అనుకుందాం.. 

More Related Stories