English   

నిఖిల్ నువ్వు సూపరెహే.. 

Tarun-Bhaskar
2018-02-14 17:38:07

స్వామిరారా నుంచి రూట్ మార్చి విజయాలు సాధిస్తోన్న హీరో నిఖిల్. కొత్త దర్శకులతో వెళుతూ కొత్తదనం ఉన్న సినిమాలూ చేస్తోన్న నిఖిల్ ప్రస్తుతం కిరిక్ పార్టీ అనే కన్నడ సినిమాను తెలుగులో కిరాక్ పార్టీగా చేస్తున్నాడు. షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ లో ఉందీ మూవీ. మార్చి ఫస్ట్ వీక్ లో విడుదలయ్యే చాన్స్ ఉంది. దీని తర్వాత నిఖిల్ ప్లానింగ్స్ పర్ఫెక్ట్ గా ఉన్నాయి. 2016లో తమిళంలో సూపర్ హిట్ అయిన కణితన్ అనే తమిళ సినిమాను తెలుగులో రీమేక్ చేయబోతున్నాడు. ఇది నిఖిల్ కు ఫేవరెట్ మూవీ అని కూడా చెబుతున్నారు. దీని తర్వాత మనోడు పెళ్లి చూపులు ఫేమ్ తరుణ్ భాస్కర్ తో కమిట్ అయినట్టు టాక్. 

పెళ్లిచూపులుతో ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్ అయిపోయాడు తరుణ్ భాస్కర్. కానీ సెకండ్ మూవీ స్టార్ట్ చేయడానికి మాత్రం చాలా టైమ్ తీసుకున్నాడు. ఫైనల్ గా మళ్లీ కొత్తవారితోనే ఓ సినిమా చేస్తున్నాడిప్పుడు. ఈ సినిమా పేరు ‘ఈ నగరానికి ఏమైంది’. సగానికిపైగా షూటింగ్ పూర్తి చేసుకుందీ మూవీ. దీని తర్వాత తరుణ్, నిఖిల్ సినిమా చేయబోతున్నాడట. రీసెంట్ గా తరుణ్ నిఖిల్ కు తన వద్ద ఉన్న ఓ స్టోరీలైన్ చెప్పాడట. అది నిఖిల్ కు బాగా నచ్చడంతో వెంటనే ఓకే చెప్పినట్టు టాక్. ప్రస్తుతం ఈ ఇద్దరూ చేస్తోన్న సినిమాలు పూర్తి కాగానే.. అంటే నిఖిల్ కణితన్ రీమేక్, తరుణ్ భాస్కర్ ఈ నగరానికి ఏమైంది చిత్రాలు పూర్తి కాగానే ఈ క్రేజీ కాంబో సెట్స్ పైకి వెళుతుందట. మొత్తానికి సెలెక్టివ్ మూవీస్ తో సెటిల్డ్ పర్ఫార్మెన్స్ తో కొత్త దర్శకులతో సరికొత్త హిట్లు కొడుతోన్న నిఖిల్ ప్లానింగ్ చూస్తే నువ్వు సూపరెహే.. అనకుండా ఉండగలమా..?  

More Related Stories