English   

త‌రుణ్ ముంబైలో తేలాడేంటి..? 

tarunbhasker-001
2018-07-02 21:01:59

త‌రుణ్ అంటే హీరో త‌రుణ్ కాదు.. ద‌ర్శ‌కుడు త‌రుణ్ భాస్క‌ర్. ఈయ‌న ఇప్పుడు ముంబైలో తేలాడు. సోష‌ల్ మీడియాలో రివ్యూ రైట‌ర్స్ పై అగ్గి రాజేసి ఆ త‌ర్వాత ఉన్న‌ట్లుండి ముంబై వెళ్లాడు ఈ ద‌ర్శ‌కుడు. అక్క‌డ రాజ్ కుమార్ హిరాణీని క‌లిసి ఫోటో కూడా పెట్టాడు. ఈ ఇద్ద‌రు ద‌ర్శ‌కులు ఇలా క‌ల‌వ‌డం వెన‌క మ‌త‌ల‌బేంటో మాత్రం అర్థం కావ‌డం లేదు. త‌న‌కు హిరాణీ అంటే ఇష్టం అని ఎప్ప‌ట్నుంచో చెబుతూనే ఉన్నాడు త‌రుణ్ భాస్క‌ర్. ఇప్పుడు ఛాన్స్ రావ‌డంతో త‌న‌కు ఇష్ట‌మైన ద‌ర్శ‌కుడితో ఫోటో దిగాడు ఈ ద‌ర్శ‌కుడు.

దానికితోడు అక్క‌డ హిరాణీ తెర‌కెక్కించిన సంజూ.. ఇక్క‌డ త‌రుణ్ తెర‌కెక్కించిన ఈ న‌గ‌రానికి ఏమైంది సినిమాలు జూన్ 29నే విడుద‌లయ్యాయి. ఇందులో సంజూ బ్లాక్ బ‌స్ట‌ర్ కాగా.. ఈ న‌గ‌రానికి యావ‌రేజ్ గా ఆడుతుంది. అయితే ఇలా స‌డ‌న్ గా త‌రుణ్ ముంబైలో ప్ర‌త్య‌క్షం అయ్యేస‌రికి కొంప‌దీపి బాలీవుడ్ సినిమా కానీ చేస్తున్నాడేమో అనే అనుమ‌నాలు కూడా లేక‌పోలేవు. ఎందు కంటే ఇప్పుడు తెలుగు ద‌ర్శ‌కుల‌కు హిందీలో డిమాండ్ బాగా ఉంది. క్రిష్.. రాజ‌మౌళి.. సందీప్ రెడ్డి వంగా ఇలా వీళ్ళంతా ఇప్పుడు బాలీవుడ్ లోనూ సంచ‌ల‌నాలు సృష్టిస్తున్నారు. దాంతో ఇప్పుడు త‌రుణ్ భాస్క‌ర్ కు కూడా ఇలాంటి అవ‌కాశం వ‌చ్చిందేమో అనే వార్త‌లు వినిపిస్తున్నాయి. మ‌రి దీనిపై త‌రుణ్ క్లారిటీ ఇవ్వాలింకా..

More Related Stories