English   

పాపం తరుణ్..?

Tarun-Idi-Naa-Love- Story
2018-02-15 14:12:53

ఒకప్పుడు లవర్ బాయ్ ఇమేజ్ తో ఓ వెలుగు వెలిగిన హీరో తరుణ్. వరుస విజయాలతో స్టార్ హీరో అయిపోయాడప్పుడు. కానీ ఎప్పుడూ లవర్ బాయ్ అంటే చూడ్డం కష్టం కదా. అందుకే ఫ్లాపులు మొదలయ్యాయి. ఈలోగా పర్సనల్ లైఫ్ కూడా కొంత డిస్ట్రబ్ కావడంతో ఏకంగా వెండితెరకే దూరమయిపోయాడు. ఈ నేపథ్యంలో కొన్నాళ్ల క్రితం కన్నడలో హిట్ అయిన ఓ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తూ ఇదీ నా ప్రేమకథ అన్నాడు.ఆ సినిమా మొదలై విడుదలయ్యే టైమ్ కు తరుణ్ ఏకంగా నాలుగు బర్త్డ్ డేలు చేసుకున్నాడు. మరి ఇన్నాళ్ల గ్యాప్ తర్వాత ఈ వేలైంటైన్స్ డే సందర్భంగా విడుదలైందీ చిత్రం. చాలా మంది ఇది తరుణ్ కు కమ్ బ్యాక్ మూవీ అనుకున్నారు. కానీ అలా జరగలేదు. 

ఇదీ నా లవ్ స్టోరీ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ హాహాకారాలు పెడుతున్నారు. వాయిస్ ఓవర్ తో సాగే  ఈసినిమా డాక్యుమెంటరీని తలపించిందంటున్నారు. అలాగే సీన్స కంటే వాయిస్ ఓవర్స్ ఎక్కువగా ఉన్నాయట. ప్రతి కథకూ ఉపకథ. ప్రతి డైలాగ్ కూ ఉపమానాలు చెబుతూ మొదలైన పది నిమిషాలకే పరిస్థితి చేయిదాటిన ఫీలింగ్ ప్రేక్షకుల్లో కలిగేలా చేయడంలో ఈ ప్రేమకథ సూపర్ సక్సెస్ అయినట్టు చెబుతున్నారు. ఏదేమైనా ఇన్నేళ్ల తర్వాత వస్తోన్న సినిమా అంటే చాలావరకూ ఫ్రెష్ నెస్ ఎక్స్ పెక్ట్ చేస్తారు. అది ఇందులో ఏ కోశానా కనిపించలేదట. తరుణ్ పర్ఫార్మెన్స్ వరకూ ఎప్పట్లానే సెటిల్డ్ గా ఉన్నా.. మిగతా విషయాల్లో దర్శకుడు పూర్తిగా ఫెయిల్ అయ్యాడు. దీంతో ఫ్రీగా షో వేసినా పావుగంట కంటే ఎక్కువసేపు చూడలేకపోతున్నారట ప్రేక్షకులు. పాపం తరుణ్.. ఈ మూవీపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. కానీ అవన్నీ ఫస్ట్ షో పావుగంటకే ఆవిరైపోయాయి. ఇకపై తరుణ్ ను ఇంకెవరూ పట్టించుకోరేమో.. 

More Related Stories