English   

క‌రోనాను ఇలా త‌రిమికొడ‌దాం... ఆర్ఆర్ఆర్ టీం వీడియో

RRR
2021-05-06 15:13:23

దేశంలో క‌రోనా డేంజ‌ర్ బెల్స్ మోగిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. క‌రోనా క‌ట్ట‌డికి సామాజిక దూరం స్వీయ ప‌రిశుభ్ర‌త త‌ప్ప వేరే మార్గం లేద‌ని డాక్ట‌ర్లు హెచ్చ‌రిస్తున్నారు. అయిన‌ప్ప‌టికీ ప్ర‌జ‌లు ఏమీ ప‌ట్ట‌న‌ట్టు గుంపులు గుంపులుగా తిరుగుతూ పాటించాల్సిన జాగ్ర‌త్తలు పాటించ‌డంలేదు. అంతే కాకుండా వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ మొద‌లు పెట్టినా ఇంకా గ్రామీణ ప్ర‌జ‌లు వ్యాక్సిన్ వేసుకునేందుకు ముందుకు రావ‌డం లేదు. దాంతో వైర‌స్ వ్యాప్తి మ‌రింత వేగంగా పెరుగుతుంది. 

అయితే తాజాగా క‌రోనా విజృంభ‌న తగ్గుముఖం ప‌ట్టాలంటే త‌గిన జాగ్ర‌త్తలు తీసుకోవాల‌ని వ్యాక్సిన్ త‌ప్ప‌కుండా వేసుకోవాల‌ని టీం ఆర్ఆర్ఆర్ ఓ వీడియోను విడుద‌ల చేసింది. వీడియోలో క‌రోనా మ‌హ‌మ్మారిని మ‌న దేశం నుండి త‌రిమికొట్టాలంటే ప్ర‌తి ఒక్క‌రూ మాస్క్ ధ‌రించి..చేతులు శుభ్రం చేసుకోవాల‌ని తెలిపారు. అంతే కాకుండా ప్ర‌తి ఒక్క‌రూ వ్యాక్సిన్ వేసుకోవాల‌ని తెలిపారు. వ్యాక్సిన్ పై ఎలాంటి అపోహ‌లు పెట్టుకోకూడద‌ని చెప్పారు. 

ఇక వీడియోలో రామ్ చ‌ర‌ణ్, ఎన్టీఆర్, రాజ‌మౌళి, అలియా భ‌ట‌, అజ‌య్ దేవ్ గ‌ణ్ ఉన్నారు. వారు ఒక్కో భాష‌లో ఒక్కొక్క‌రు మాట్లాడుతూ జాగ్ర‌త్తలు చెప్పారు. ఇక వీడియోలో అలియా భ‌ట్ ముద్దుముద్దుగా తెలుగు మాట్లాడుతూ ఆక‌ట్టుకుంది. అజ‌య్ దేవ్ గ‌ణ్ హిందీలో మాట్లాడగా చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్, రాజ‌మౌళి లు త‌మిళ మ‌ళ‌యాల భాషల్లో అద‌ర‌గొట్టారు. ఇదిలా ఉండ‌గా ఇప్ప‌టికే ఆర్ఆర్ఆర్ షూటింగ్ చివ‌రి ద‌శ‌కు చేరుకుంది. అయితే క‌రోనా విజృంభ‌న నేపథ్యంలో ప్ర‌స్తుతం షూటింగ్ కు బ్రేక్ ప‌డింది. 

More Related Stories