English   

రజినీకాంత్‌కు తప్పిన ప్రమాదం.. ఫ్లైట్‌లో సాంకేతిక లోపం..

Rajinikanth
2020-01-27 16:03:24

ఈ రోజుల్లో ఫ్లైట్ ప్రమాదాలు రోజూ చూస్తూనే ఉన్నాం. ఏ లోపం ఎప్పుడు బయటికి వస్తుందో చెప్పలేని పరిస్థితి. ఇప్పుడు రజినీకాంత్ కు కూడా ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. ఈయన చెన్నై నుంచి మైసూరు వెళ్లాల్సిన ప్రైవేట్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దాంతో ఎయిర్ పోర్టులోనే రెండు గంటల పాటు ఉన్నాడు రజినీకాంత్. అనుకోకుండా జరిగిన ఈ అనుభవంతో ఆయన కూడా షాక్ అయ్యాడు. 

ఈ జెట్ లో రజినీతో సహా 47 మంది ప్రయాణికులు ఉన్నారు. రెండు గంటల పాటు ఎయిర్‌పోర్ట్‌లోనే ఉండటంతో అభిమానులు ఆయన్ని చుట్టుముట్టారు. ఆయనతో సెల్ఫీల కోసం ఎగబడ్డారు. రజినీ కూడా తనకు దొరికిన సమయాన్ని అభిమానులతోనే గడిపేసాడు. అనంతరం ఫ్లైట్ బాగు చేసి అందులోనే ప్రయాణికులకు ఎక్కించారు సిబ్బంది. జరిగిన దానికి క్షమాపణ చెప్పారు. లోపాన్ని సవరించిన తర్వాత అక్కడ్నుంచి వెళ్లిపోయాడు సూపర్ స్టార్. ప్రస్తుతం ఈయన సిరుత్తై శివ దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ జరుగుతుంది. దర్బార్ సినిమా కూడా అంచనాలు అందుకోకపోవడంతో రజినీకాంత్ ప్రస్తుతం హిట్ కొట్టే మిషన్ లో ఉన్నాడు.

More Related Stories