English   

ట్రైలర్.. తేజూ ఐ లవ్యూ అనేలానే ఉంది.. 

Tej-I-love-Trailer

ఫస్ట్ మూవీతోనే టాలీవుడ్ లో తనకంటూ ఓ మార్క్ ను క్రియేట్ చేసుకున్న దర్శకుడు కరుణాకరన్. క్యూట్ లవ్ స్టోరీస్ కు కేరాఫ్ గా అతని పేరు చెబుతారు. అతని ఫస్ట్ మూవీ తొలిప్రేమతోనే పవన్ కళ్యాణ్ కు తిరుగులేని బ్రేక్ నిచ్చాడు. ప్రస్తుతం సాయిధరమ్ తేజ్ తో తేజ్ ఐలవ్యూ అనే సినిమా సినిమా చేశాడు. కెఎస్ రామారావు నిర్మించిన ఈ మూవీ ట్రైలర్ విడుదలైంది... 

సాయిధరమ్ తేజ్ వరుస ఫ్లాపుల్లో ఉన్నాడిప్పుడు. దీంతో పెద్ద మావయ్యకు బెస్ట్ మూవీ ఇచ్చి నిర్మాత, చిన్నమావకు తిరుగులేని బ్రేక్ ఇచ్చిన దర్శకుడితో కలిసి తేజ్ ఐలవ్యూ అంటూ వస్తున్నాడు. కరుణాకరన్ దర్శకత్వంలో తేజూ నటించిన ఫస్ట్ మూవీ ఇది. అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది. గోపీసుందర్ సంగీతం అందించిన ఈ మూవీలోని పాటలు ఆల్రెడీ హిట్ అయ్యాయి. ఇక జూలై 6న విడుదల కాబోతోన్న తేజ్ ఐలవ్యూ ట్రైలర్ ను విడుదల చేశారు. 
 
అమ్మాయిల్ని పడేయడం చాలా ఈజీ.. అంటూ ఫ్రెండ్స్ కు సలహాలిచ్చిన ఓ కుర్రాడు అనుకోకుండా ఓ అమ్మాయికి బుక్ అయిపోతాడు. దీంతో ఆమె అతన్ని ఫుల్లుగా వాడేసుకుంటుంది. ఈ మధ్యలో వారి మధ్య ప్రేమ కలగడం.. తర్వాత అపార్థాలు.. ఇలా సాగుతుందీ ట్రైలర్. అయితే ట్రైలర్ లో ఆకట్టుకున్న విషయం ఏంటంటే.. సాయిధరమ్ తేజ్ ఎక్కడా ఓవరాక్షన్ చేయకుండా కుదురుగా ఉండటం. పూర్తిగా కరుణాకరన్ మార్క్ లో సాగే సినిమాగా అర్థమౌతోంది. అలాగే సినిమాలోని మోసం చేసి ప్రేమను పొందాలని చూస్తే.. నిజంగానే ప్రేమిస్తే ఆ ప్రేమను ఏం చేసుకుంటావ్ అనే డైలాగ్ అదిరిపోయింది. 
 
ఓవరాల్ గా తేజ్ ఐలవ్యూ ట్రైలర్ ఆకట్టుకునేలా ఉంది. తేజూ, అనుపమ జంట కూడా ఫ్రెష్ గా కనిపిస్తోంది. ఇక మళ్లీమళ్లీ ఇది రాని రోజు తర్వాత క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్ లో వస్తోన్న మరో క్యూట్ లవ్ స్టోరీగా అనిపిస్తోంది. మరి జూలై 6న విడుదల కాబోతోన్న ఈ సినిమాతో అయినా తేజూ హిట్ అందుకుంటాడేమో చూడాలి. 

More Related Stories