English   

ట్రైల‌ర్ లేకుండా ఎలా తేజ్..?

Tej I Love You
2018-06-11 08:17:44

 

ఈ రోజుల్లో స్టార్ హీరోల సినిమాల‌కైనా ముందు అభిమానులు కోరుకునేది ట్రైల‌ర్. అది లేకుండా వ‌స్తామంటే ర‌జినీకాంత్ నే చూడ‌లేదు ప్రేక్ష‌కులు. ఇప్పుడు తేజ్ ఐ ల‌వ్ యూ ఆడియో వేడుక‌లో కూడా ట్రైల‌ర్ విడుద‌ల చేయ‌లేదు. ఒక‌ప్పుడు ఆడియో వేడుక‌లో ట్రైల‌ర్ విడుద‌ల చేయ‌డం ట్రెండ్. కానీ ఇప్పుడు అది మారిపోయింది. స‌ప‌రేట్ గా ట్రైల‌ర్ రిలీజ్ కు కూడా ఓ చిన్న సైజ్ ఫంక్ష‌న్ చేస్తున్నారు. ఇప్పుడు కూడా ఇదే జ‌రిగింది. ఆడియో వేడుక అంటే కేవ‌లం ఆడియోను మాత్ర‌మే విడుద‌ల చేసారు. అందుకే తేజ్ ఐ ల‌వ్ యూ ట్రైల‌ర్ క‌నిపించ‌లేదు ఎక్క‌డా. దీనికోసం మ‌రో ముహూర్తం సెట్ చేసారు. చిరంజీవి చేతుల మీదుగా విడుద‌లైంది తేజ్ ఆడియో. గోపీసుంద‌ర్ సంగీతం అందిస్తున్నాడు. అయితే ఈ చిత్రంపై అంచ‌నాలు మాత్రం పెద్ద‌గా లేవు. దానికి కార‌ణం సాయిధ‌రంతేజ్ కెరీర్ గ్రాఫ్. ఒక‌టి రెండు కాదు.. ఏకంగా ఐదు డిజాస్ట‌ర్లు ఇచ్చాడు వ‌ర‌స‌గా. పైగా క‌రుణాక‌ర‌ణ్ కూడా ఇప్పుడు ఫామ్ లో లేడు. దానికితోడు క్రియేటివ్ క‌మ‌ర్షియ‌ల్స్ బ్యాన‌ర్ చాలా రోజుల త‌ర్వాత చేసిన సినిమా ఇది. దాంతో ఎటు చూసుకున్నా తేజ్ కు పెద్ద‌గా క్రేజ్ అయితే లేదు. కానీ సాయికు ఇమేజ్ అయితే ఉంది. కాస్త పాజిటివ్ టాక్ వ‌స్తే క‌చ్చితంగా సినిమాను హిట్ చేసే స‌త్తా సాయిధ‌రంతేజ్ సొంతం. మ‌రి చూడాలిక‌.. జూన్ 29న ఏం చేయ‌బోతున్నాడో ఈ కుర్ర హీరో. 

More Related Stories