English   

 తేజ్ ట్రైల‌ర్.. మ‌ళ్లీ అదేనా క‌రుణాక‌రా..?

Tej-I-Love-You

ఈ రోజుల్లో స్టార్ హీరోల సినిమాల‌కైనా ముందు అభిమానులు కోరుకునేది ట్రైల‌ర్. అది చూసిన వెంట‌నే సినిమా ఇలా ఉంటుంద‌ని ఓ అంచ‌నాకు వ‌చ్చేస్తున్నారు ప్రేక్ష‌కులు. ఇప్పుడు తేజ్ ఐ ల‌వ్ యూ ట్రైల‌ర్ విడుద‌లైంది. ఇది చూసిన త‌ర్వాత కరుణాక‌ర‌ణ్ ఏం మార‌లేద‌ని అర్థ‌మైపోయింది. పైగా సాయిధ‌రంతేజ్ ను కూడా త‌న దారిలోకి తెచ్చేసుకున్నాడు ఈ ద‌ర్శ‌కుడు. ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్ లో పాత విజువ‌ల్స్ క‌నిపించాయి.. ఇక ప్రోమో సాంగ్స్ లో కూడా అదే డార్లింగ్.. ఎందుకంటే ప్రేమంట ఛాయ‌లు క‌నిపించాయి. ఇప్పుడు ట్రైల‌ర్ అయితే అవ‌న్నీ క‌లిపి కొడితే ఎలా ఉంటుందో అలా ఉంది. హీరోయిన్ ను ప్రేమ‌లోకి దించ‌డానికి హీరో నాట‌కాలు ఆడ‌టం.. చివ‌ర్లో తెలుసుకోవ‌డం.. ఇవ‌న్నీ క‌రుణాక‌ర‌ణ్ గ‌త సినిమాల్లో చూసిన‌వే. ఇప్పుడు మ‌ళ్లీ అదే చేసాడు. గోపీసుంద‌ర్ సంగీతం అందిస్తున్నాడు. అయితే ఈ చిత్రంపై అంచ‌నాలు మాత్రం పెద్ద‌గా లేవు. దానికి కార‌ణం సాయిధ‌రంతేజ్ కెరీర్ గ్రాఫ్. ఒక‌టి రెండు కాదు.. ఏకంగా ఐదు డిజాస్ట‌ర్లు ఇచ్చాడు వ‌ర‌స‌గా. పైగా క‌రుణాక‌ర‌ణ్ కూడా ఇప్పుడు ఫామ్ లో లేడు. దానికితోడు క్రియేటివ్ క‌మ‌ర్షియ‌ల్స్ బ్యాన‌ర్ చాలా రోజుల త‌ర్వాత చేసిన సినిమా ఇది. దాంతో ఎటు చూసుకున్నా తేజ్ కు పెద్ద‌గా క్రేజ్ అయితే లేదు. కానీ సాయికు ఇమేజ్ అయితే ఉంది. కాస్త పాజిటివ్ టాక్ వ‌స్తే క‌చ్చితంగా సినిమాను హిట్ చేసే స‌త్తా సాయిధ‌రంతేజ్ సొంతం. మ‌రి చూడాలిక‌.. జులై 6న ఏం చేయ‌బోతున్నాడో ఈ కుర్ర హీరో.

More Related Stories