English   

తేజ్..  లవర్ మిస్ అయిందే.. 

Tej-I-Love-You
2018-05-01 16:39:49

ప్రేమలో ఉన్నప్పుడు ఇల్యూషన్స్ కామన్. లేనివి ఉన్నట్టు.. ఉన్నవి లేనట్టు ఊహించుకుంటారు. ఇవాళ విడుదలైన తేజ్ ఐ లవ్ యూ టీజర్ లోనూ ఇదే కనిపించింది. ఓ వర్షం కురుస్తోన్న పగలు.. తేజ్ బస్టాప్ లో టీ తాగుతుంటాడు. ఆపక్కన అందమైన అనుపమ గిటార్ వాయిస్తూ ఉంటుంది. కట్ చేస్తే మనోడి ఒడిలోకి వచ్చి అతని తాపిస్తుంటే టీ తాగుతూ ఉంటుంది. ఈ లోగా హారన్ మోగుతుంది. మనోడి ఊహా ఆగుతుంది. అంటే అప్పటి వరకూ తన ఒడిలో ఉన్న లవర్ కూడా మిస్ అయిపోయినట్టే కదా. ఈ టీజర్ లో ఉన్న ‘మ్యాజిక్’ఇదే. బస్టాప్ లో వెనక ‘ఫ్రెష్ మెల్ట్జ్’ అనే యాడ్ కనిపిస్తోంది. ఇది కూడా కథను తెలియజేస్తుంది అనుకోవచ్చు. 

కరుణాకరన్ దర్శకత్వంలో వస్తోన్న ఈ మూవీ ఇప్పుడు దర్శకుడితో పాటు తేజూ, అనుపమలకూ కీలకం కానుంది. ఈ నేపథ్యంలో విడుదల చేసిన ఈ టీజర్ పెద్దగా ఆట్టుకోలేకపోయిందనేది నిజం. పైగా టీజర్ చూస్తోంటే కరుణాకరన్ డార్లింగ్ గుర్తొస్తోంది. ఫస్ట్ హాఫ్ అంతా నడిచిన ప్రేమకథ ఇంటర్వెల్ బ్యాంగ్ తో అబద్ధం అయినట్టు.. ఇతని ఊహల్లోనే తప్ప ఆమె నిజంగా కనిపించడం లేదు అని చూపించారు. కాకపోతే ఈ టీజర్ చూస్తే ఇదో ప్యూర్ లవ్ స్టోరీగా మాత్రం అర్థమౌతోంది. అమ్మాయి ప్రేమ కోసం తపించే కుర్రాడిగా తేజూ కనిపిస్తాడని తెలుస్తోంది. రొమాంటిక్ ఎటర్టైనర్ అని ముందు నుంచీ చెబుతున్నారు. అందుకు తగ్గ ఫ్లేవర్ అయితే కొంత వరకూ కనిపిస్తోంది కానీ.. మెయిన్ థీమ్ తెలియడం లేదు. మొత్తంగా కెఎస్ రామారావు నిర్మిస్తోన్న సినిమా కాబట్టి ఖచ్చితంగా మంచి కంటెంట్ ఎక్స్ పెక్ట్ చేయొచ్చు. గోపీ సుందర్ సంగీతం అందిస్తోన్న ఈ మూవీతో అయినా తేజూ టైమ్ మారుతుందా లేదా అనేది చూడాలి.. 

More Related Stories