English   

ఉదయ్ కిరణ్ బయోపిక్కా.. ఛాన్సే లేదు..?

Uday-Kirans-Biopic
2018-05-18 10:01:08

మహానటి తర్వాత టాలీవుడ్ లో బయోపిక్ రూమర్స్ భయపెడుతున్నాయంటే అతిశయోక్తి కాదు. ఇప్పటికే చాలా బయోపిక్స్ పై రూమర్స్ వస్తున్నాయి. లేటెస్ట్ గా మొన్నటి లవర్ బాయ్ ఉదయ్ కిరణ్ బయోపిక్ రాబోతోందనే వార్త కూడా హల్చల్ చేస్తోంది. అంతే కాదు.. ఈ సినిమాకు ఉదయ్ కిరణ్ ను ఇండస్ట్రీకి పరిచయం చేసిన తేజ డైరెక్టర్ అని చెప్పడంతో ఇది నిజమే అనుకున్నారు చాలామంది. ఇంకొందరైతే మరో రూమర్ ముందుకేసి ‘చిరంజీవి పాత్రలో రాజశేఖర్’ నటిస్తున్నాడు అని కూడా చెబుతున్నారు. బట్ ఇదంతా అబద్ధం ఖచ్చితంగా తేల్చి చెప్పాడు తేజ. యస్.. తానీ సినిమా చేయడం లేదని ఆయనే స్వయంగా చెప్పాడు. కాకపోతే ఓపెన్ స్టేట్మెంట్ కాదు. ఎవరైనా మీడియా మిత్రులు ఫోన్ చేసి అడిగితే కాదని ఖచ్చితంగా చెబుతున్నాడు. అంతే కాదు.. అసలు తాను బయోపిక్ లే చేయనని కూడా స్పష్టంగా తేల్చాడు. దీంతో ఉదయ్ కిరణ్ బయోపిక్ కు ఫుల్ స్టాప్ పెడితే మంచిది. లేదంటే అనవసరంగా ఆడియన్స్ ను కన్ఫ్యూజ్ చేయడం తప్ప వేరేదీ ఉండదు. 

ఇక ఆల్రెడీ బాలయ్య ప్రధాన పాత్రలో చేస్తోన్న ఎన్టీఆర్ బయోపిక్ నుంచి తప్పుకున్న తేజ తర్వాత ఎవరితో సినిమా చేస్తాడా అనే ఊహాగానాలు వినిపించాయి. వీటిలో మళ్లీ రానాతో చేస్తాడనే వార్త ఒకటి వినిపిచింది. కానీ అది కూడా ఇప్పుడప్పుడే ఉండదని చెప్పాడు తేజ. కాకపోతే ఎప్పుడు ఉంటుందనేది కూడా చెప్పలేనన్నాడు. మరి ఇప్పుడేంటీ అంటే.. ఆగిపోయిన వెంకటేష్ సినిమానే మళ్లీ పట్టాలెక్కించబోతున్నాడట. ఈ మేరకు వెంకీ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. వెంకీ కూడా ఖాళీగానే ఉన్నాడు కాబట్టి.. ఈ ప్రాజెక్ట్ త్వరలోనే పట్టాలెక్కుతుంది అనుకోవచ్చు. మొత్తంగా ఇక ఉదయ్ కిరణ్ బయోపిక్, తేజ దర్శకుడు అనే రూమర్స్ కు చెక్ పెడితే మంచిదిక.

More Related Stories