English   

మ‌ళ్లీ నాగ్ తో ఏంటి తేజ‌..? 

Teja-nagarjuna
2018-05-03 20:08:54

క్లారిటీ లేక‌పోతే ఎన్ని క‌ష్టాలు వ‌స్తాయో అనేదిప్పుడు ద‌ర్శ‌కుడు తేజ‌ను చూస్తుంటే అర్థ‌మైపోతుంది. మొన్న‌టి వ‌ర‌కు చేతిలో రెండు భారీ సినిమాల‌తో సూప‌ర్ సెకండ్ ఇన్నింగ్స్ అనుకున్నారంతా. కానీ ఇప్పుడు ఉన్న‌ట్లుండి మ‌ళ్లీ ఖాళీ అయిపోయాడు. లేదు లేదు.. త‌నే చేసుకున్నాడు. స్వ‌యంకృతం అనే ప‌దానికి అర్థంలా మారిపోయాడు ఈ ద‌ర్శ‌కుడు. బాల‌య్య కోసం వెంక‌టేశ్ సినిమాను వ‌దిలేసుకున్నాడు. ఆయ‌న సినిమాను మొద‌లు పెట్టి మ‌రీ ఆపేసాడు. ఆ త‌ర్వాత ఎందుకో తెలియ‌దు కానీ బాల‌య్య సినిమాను కూడా వద్ద‌నుకున్నాడు. స్టార్ హీరోల‌తో తాను సినిమాలు చేయ‌లేన‌ని అప్ప‌ట్లో అన్నాడు తేజ‌. ఇప్పుడు ఈయ‌న తీరు చూస్తుంటే ఇది నిజ‌మే అనిపిస్తుంది. ఇక ఇప్పుడు అంతా అయిపోయారు. మ‌ళ్లీ నాగార్జున‌తో సినిమా అంటూ వార్త‌లొస్తున్నాయి. వ‌స్తున్నా.. ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేదు.. న‌మ్మ‌డం లేదు కూడా. ఎందుకంటే ఏదో ఒక రోజు ఈ చిత్రాన్ని కూడా వ‌దిలేసుకుని.. మ‌ళ్లీ ఏ చిన్న సినిమానో చేసుకంటాడు ఈ ద‌ర్శ‌కుడు. మ‌రి చూడాలిక‌.. ఈయ‌న త‌ర్వాతి సినిమా ఏంటో..? ఎవ‌రితో ఉంటుందో..?

More Related Stories