English   

తేజ... ఒకేసారి రెండు సినిమాలు...

Teja Director.jpg
2020-02-23 07:50:14

సీనియర్ దర్శకుడు తేజ కొన్ని రోజులుగా సైలెంట్ అయిపోయాడు. సీత సినిమా ఫ్లాప్ అయిన తర్వాత ఈయనకు మళ్లీ కష్టకాలం మొదలైందని అనుకున్నారంతా. కానీ సైలెంట్ గా రెండు సినిమాలను లైన్ లో పెట్టేసాడు ఈయన. తాజాగా ఫిబ్రవరి 22న ఈయన పుట్టిన రోజు కానుకగా ఒకేసారి రెండు కొత్త సినిమాల టైటిల్స్, హీరోలను అనౌన్స్ చేసి అందరికీ షాక్ ఇచ్చాడు ఈ దర్శకుడు.

ఓ సినిమాలో గోపీచంద్, మరో సినిమాలో రానా హీరోలుగా నటించనున్నారు. రానా సినిమా కోసం 'రాక్షస రాజు రావణాసురుడు', గోపీచంద్ కోసం 'అలిమేలు మంగ వెంకట రమణ' అనే ఆసక్తికర టైటిల్స్ రిజిస్టర్ చేయించాడు ఈ దర్శకుడు. ఈ సినిమాలకు వీళ్లే హీరోలు అని చెప్పలేదు కానీ చాలా రోజులుగా రానా హీరోగా రాక్షసరాజు రావణాసురుడు సినిమా చేస్తాడని వార్తలు వస్తున్నాయి. మరోవైపు గోపీచంద్ తో ఫ్యామిలీ సబ్జెక్ట్ చేస్తున్నాడు ఈయన.

ఈ సినిమాల నిర్మాతలను.. వాటిలో నటించే నటీనటుల లిస్ట్ త్వరలోనే తేజ ప్రకటించనున్నారు. ఇప్పటికే ఆయన ఈ సినిమాల స్క్రిప్టుల్ని పూర్తి చేశారు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. ఇదిలా ఉంటే గోపీచంద్ కు జయం సినిమాతో బ్రేక్ ఇచ్చింది ఈయనే. ఇక రానాకు 'నేనే రాజు నేనే మంత్రి' సినిమాతో రానాకు సోలో హిట్ అందించాడు. మరి ఈ రెండు సినిమాలతో తేజ ఏం చేస్తాడో చూడాలిక...

More Related Stories