English   

తేజ వాళ్ల‌కు క‌మిట‌య్యాడంట‌..!

teja with venkatesh and balakrishna

చేతిలో ఉన్న రెండు పెద్ద సినిమాల‌ను వ‌దిలేసుకున్నాడు తేజ‌. నేనేరాజు నేనేమంత్రి త‌ర్వాత తేజ‌కు మ‌ళ్లీ క్రేజ్ వ‌చ్చింది. దాంతో వెంక‌టేశ్, బాల‌య్య లాంటి స్టార్ హీరోలు కూడా కోరి మ‌రీ తేజ‌తో సినిమా చేయాల‌నుకున్నారు. ఇద్ద‌రి సినిమాలు ఒప్పుకున్నాడు కూడా. కానీ ఇప్పుడు చేతిలో ఒక్క సినిమా కూడా లేదు. బాల‌య్య‌తో చేయాల్సిన ఎన్టీఆర్ బ‌యోపిక్ కోసం వెంకీ సినిమాను ప‌క్క‌న‌బెట్టాడు. కానీ బాలయ్యే ఈయ‌న్ని ప‌క్క‌నబెట్టేస‌రికి వెంకీ సినిమా కూడా చేజారిపోయింది. ఈ రెండు సినిమాలు ఆగిపోవ‌డంతో ఇప్పుడు నెక్ట్స్ ఏం చేయాలా అనే క‌న్ఫ్యూజ‌న్ మొద‌లైంది. ప్ర‌స్తుతం ఈ ద‌ర్శ‌కుడు రానా కోసం చూస్తున్నాడు కానీ ఆయ‌న మ‌రో రెండేళ్ల వ‌ర‌కు బిజీ. మొన్నటి వ‌ర‌కు ఉద‌య్ కిర‌ణ్ బ‌యోపిక్ ఉంటుంద‌ని వార్త‌లొచ్చాయి కానీ ఇప్పుడు అది కూడా లేద‌ని తేలిపోయింది. అయితే ఇప్పుడు వేగ ఎంట‌ర్ టైన్మెంట్స్ లో తేజ ఓ సినిమాకు క‌మిట‌య్యాడ‌ని.. అందులో ఓ స్టార్ హీరో న‌టిస్తాడ‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. అయితే ఆ స్టార్ హీరో ఎవ‌రు అనే విష‌యంపై మాత్రం క్లారిటీ రావ‌డం లేదు. కానీ ఈ చిత్రం త్వ‌ర‌లోనే ప‌ట్టాలెక్క‌బోతుంద‌ని.. త‌క్కువ బ‌డ్జెట్ లో తేజ ఈ చిత్రాన్ని పూర్తి చేసేందుకు స‌న్నాహాలు చేసుకుంటున్నాడ‌ని తెలుస్తుంది. 

More Related Stories