English   

తెలంగాణ మెగాస్టార్ నే డామినేట్ చేసాడు

Telangana Megastar Nithiin Dominated by VIjay Devarakonda at Box Office
2018-08-19 10:16:17

ఇన్నాళ్లూ తెలంగాణ మెగాస్టార్ అంటే మ‌రో ఆలోచ‌న లేకుండా నితిన్ అనేవాళ్లు. ఎందుకంటే ఇండ‌స్ట్రీలో నైజాం నుంచి కొద్దోగొప్పో ఇమేజ్ ఉన్న  హీరో ఆయ‌న ఒక్క‌డే కాబ‌ట్టి. కానీ ఇప్పుడు ఆయ‌న‌కు మొగుడు వ‌చ్చేసాడు. అత‌డే విజ‌య్ దేవ‌ర‌కొండ‌. చూస్తుంటు ఈ కుర్ర హీరో నైజాం ఒక్క‌టే కాదు.. హోల్ ఆంధ్రాకే మొగుడ‌య్యేలా క‌నిపిస్తున్నాడు. ఈ హీరో అరాచ‌కాలు అలా ఉన్నాయి మ‌రి ఇప్పుడు. గీత‌గోవిందం ర‌చ్చ చూస్తుంటే అస‌లు ఇది చిన్న హీరో సినిమా అని.. మార్కెట్ త‌క్కువ అని ఎవ‌రూ ఊహించ‌డం లేదు. ఇంటా బ‌య‌టా ర‌చ్చ చేస్తుంది ఈ చిత్రం. ముఖ్యంగా ఓవ‌ర్సీస్ లో అయితే ఏకంగా మూడు రోజుల్లోనే 1 మిలియ‌న్ కు చేరువైంది ఈ చిత్రం.

ఇప్ప‌టికీ దున్నేస్తూనే ఉంది. శ్రీ‌నివాస క‌ళ్యాణం వ‌సూళ్ల‌ను ప్రీమియ‌ర్స్ తో దాటేసింది ఈ చిత్రం. చూస్తుంటే అక్క‌డ 2 మిలియ‌న్ వైపు గీత అడుగులు ప‌డేలా క‌నిపిస్తున్నాయి. ఇప్ప‌టికే అక్క‌డ పెళ్లిచూపులు.. అర్జున్ రెడ్డి సినిమాల‌తో మిలియ‌న్ మార్క్ అందుకున్నాడు విజ‌య్. ఇప్పుడు మూడోసారి ఈ ఫీట్ చేసాడు. ఇండియాలోనూ ఈ చిత్రం మూడు రోజుల్లోనే 16 కోట్ల షేర్ తీసుకొచ్చింది. మొత్తంగా మూడు రోజుల్లోనే 20 కోట్ల షేర్ తో పాటు 35 కోట్ల గ్రాస్ వ‌సూలు చేసింది. వీకెండ్ లో ప‌రిస్థితి ఇంకా దారుణంగా ఉండేలా క‌నిపిస్తుంది. చూద్దామ‌న్నా కూడా ఎక్క‌డా ఒక్క టికెట్ కూడా క‌నిపించ‌డం లేదు. అంత‌గా గీత‌గోవిందం అరాచ‌కం జ‌రుగుతుంది. ఫుల్ ర‌న్ లో ఈజీగా 50 కోట్ల షేర్ అందుకునేలా క‌న‌బ‌డుతుంది గీత‌గోవిందం. అలా తెలంగాణ న్యూ మెగాస్టార్ గా విజ‌య్ దేవ‌ర‌కొండ ముందుకొచ్చేసాడు.

More Related Stories