English   

తెలంగాణ పవర్ స్టార్ కు సెగ మొదలైంది

Actor Nithiin

తెలంగాణ పవర్ స్టార్.. నిన్నటి వరకూ నితిన్ ను పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పిలుచుకున్న పేరిది. అఫ్ కోర్స్.. ఇక్కడ కూడా కొందరు అలాగే అన్నారనుకోండి. తను హీరో అయ్యి రెండు దశాబ్ధాలు కావొస్తున్నా.. ఇప్పటికీ తను పవన్ కళ్యాణ్ హార్డ్ కోర్ ఫ్యాన్ ని అని నితిన్ చెప్పుకోవడమే ఇందకు కారణం. ఇష్క్ ముందు డజను ఫ్లాపులు చూసిన నితిన్.. ఇష్క్ తో మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు. త్రివిక్రమ్ తో చేసిన ‘అ ఆ’ అతని రేంజ్ ఇంకో లెవెల్ కు తీసుకెళ్లింది. ఆ దెబ్బతో మనోడిని తెలంగాణ పవర్ స్టార్ అనేయడం మొదలుపెట్టారు. కానీ ఈ ముచ్చట ఎక్కువ కాలం నిలిచేలా లేదు. కారణం విజయ్ దేవరకొండ. ఈ మధ్య నితిన్ వరుసగా మూడు ఫ్లాప్స్ చూశాడు. ప్రస్తుతం దిల్ రాజు బ్యానర్ లో శ్రీనివాస కళ్యాణం అనే సినిమాతో ఆగస్ట్ 9న రాబోతున్నాడు.

రీసెంట్ గా ఈమూవీ ఆడియో విడుదలైంది. దీంతో పాటు టీజర్ కూడా వదిలారు. అయితే ఆ తర్వాతి రోజు విజయ్ దేవరకొంద హీరోగా నటిస్తోన్న గీత గోవిందం టీజర్ కూడా వచ్చింది. ఈ రెండు టీజర్స్ కు వచ్చిన వ్యూస్ చూస్తే నితిన్ కు షాక్ తప్పదనే చెప్పాలి. అఫ్ కోర్స్ టీజర్ బావున్నంత మాత్రాన సినిమా బావుండాలనేం లేదు. అలాగే టీజర్ బాలేకపోతే సినిమా బావుండదనీ కాదు. కానీ ఇప్పుడు స్టార్ హీరోల రేంజ్ ను కూడా డిజిటల్ వ్యూస్ తో కంపేర్ చేస్తున్నారు. అందువల్ల ఎప్పుడో వచ్చిన నితిన్ కంటే ఈ మధ్యే వచ్చిన విజయ్ దేవరకొండ ఎక్కువ ప్రభావం చూపుతున్నాడునువచ్చు..

ఇక వందేళ్ల తెలుగు సినిమా చరిత్రలో తెలంగాణ నుంచి వచ్చిన ఓ హీరోస్టార్ అవడం నితిన్ తోనే మొదలైంది. అతను వచ్చినప్పుడు తెలంగాణ విడిపోలేదు కాబట్టి.. రెండు రాష్ట్రాల్లోనూ అభిమానులను సంపాదించుకున్నారు. అందువల్ల రాష్ట్రం విడిపోయిన తర్వాత నితిన్ రేంజ్ తగ్గలేదు. కానీ ఇప్పుడు విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డితో ఓవర్ నైట్ ఓవర్సీస్ లో కూడా స్టార్ అయిపోయాడు. అందువల్ల ఈ తెలంగాణ పవర్ స్టార్ కు సెగలు తప్పడం లేదు. ఇన్నాళ్లూ ఇండస్ట్రీలోని చాలామంది హీరోలతో పోటీపడ్డ నితిన్ కు ఇప్పుడు ఇంటి హీరోతో పోరు తప్పడం లేదు. పైగా ఈ రెండు సినిమాలు కూడా ఒక రోజు గ్యాప్ లో వస్తున్నాయి. ఇది ఖచ్చితంగా నితిన్ కెరీర్ కొంత సంకట స్థితిగానే చెప్పాలి. మరి ఇద్దరు తెలంగాణ స్టార్స్ లో ఎవరిది పై చేయి అవుతుందో..?

More Related Stories