English   

తెలంగాణ హీరోకు.. నిర్మాత‌కు హిట్ కావాలి..!

Telangana Producer Dil Raju And Hero Nithiin Need a Big Hit
2018-08-07 07:59:26

అస‌లే ఇండ‌స్ట్రీలో ఆంధ్రా డామినేష‌న్ ఎక్కువ‌గా ఉందని వార్త‌లు వినిపిస్తుంటాయి. లోప‌ల ఉన్న‌వాళ్ల‌కు ఆ ఫీలింగ్ ఉందో లేదో కానీ బ‌య‌టి వాళ్లు మాత్రం బాగానే ఆ తేడాలు చూపిస్తుంటారు. ముఖ్యంగా నితిన్ విష‌యంలో ఇది ఇంకా ఎక్కువ‌గా ఉంది. వ‌ర్మ లాంటి వాళ్లు కూడా నితిన్ తెలంగాణ మెగాస్టార్ అన్నాడు ఓ టైమ్ లో. ఆ త‌ర్వాత అదే మాట విజ‌య్ దేర‌వ‌కొండ‌కు కూడా వాడేసాడు అది వేరే విష‌యం. ఇక ఇప్పుడు ఈ తెలంగాణ హీరోకు విజ‌యం కావాలి. అ..ఆ లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ త‌ర్వాత లై.. ఛ‌ల్ మోహ‌న్ రంగాతో ఫ్లాపులు ఇచ్చాడు నితిన్. దాంతో ఈయ‌న ఆశ‌ల‌న్నీ శ్రీ‌నివాస క‌ళ్యాణంపైనే ఉన్నాయి.

స‌తీష్ వేగేశ్న తెర‌కెక్కించిన ఈ చిత్రాన్ని నిర్మించింది నైజాం కింగ్ దిల్ రాజు. ఈయ‌న‌కు కూడా ఇప్పుడు హిట్ కావాలి. అర‌జ‌డ‌న్ విజ‌యాల‌తో జోరుమీదున్న రాజుగారి ప్ర‌యాణానికి ల‌వర్ బ్రేక్ వేసింది. దాంతో మ‌రోసారి త‌న హిట్ ట్రాక్ స‌రి చేసుకోడానికి.. నెక్ట్స్ సినిమాల‌కు బూస్ట‌ప్ ఇవ్వ‌డానికి శ్రీ‌నివాస క‌ళ్యాణం విజ‌యం సాధించాల్సిందే..! ఆగ‌స్ట్ 9న విడుద‌ల కానుంది ఈ చిత్రం. ఒక్క దెబ్బ‌కు రెండు పిట్ట‌లు అన్న‌ట్లు.. ఈ ఒక్క సినిమాతో తెలంగాణ నిర్మాత‌.. హీరో గాడిన ప‌డాల‌ని చూస్తున్నారు. రాజును దిల్ రాజుగా మార్చిన నితిన్.. 15 ఏళ్ళ త‌ర్వాత మ‌ళ్లీ క‌లిసి ప‌నిచేస్తున్నాడు. మ‌రి దిల్ త‌ర్వాత వ‌స్తోన్న ఈ సినిమా అంత‌టి విజ‌యాన్ని అందుకుంటుందో లేదో చూడాలి..!

More Related Stories