English   

సైరాకు షాక్ ఇచ్చిన స‌ర్కార్

Telangana Revenue Officials Demolished Sye Raa Narasimha Reddy Set
2018-08-02 07:53:38

అదేంటి.. తెలంగాణ స‌ర్కార్ తో చిరంజీవి బాగానే ఉన్నాడు క‌దా.. పైగా రామ్ చ‌ర‌ణ్ కు కేటీఆర్ దోస్త్ కూడా.. అంత‌లోనే ఏమైంది అనుకుంటున్నారా ఇది రాజ‌కీయం ఎప్పుడు ఏదైనా జ‌ర‌గొచ్చు..! ఇప్పుడు కూడా ఇదే జ‌రిగింది. సైరా సెట్ ను ప్ర‌భుత్వ అధికారులు కూల్చేసారు. శేరిలింగంప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలోకి వ‌చ్చే 84 ఎక‌రాల ప్ర‌భుత్వ భూమిలో రంగ‌స్థ‌లం సెట్ వేసి సినిమా చేసాడు సుకుమార్. ఆ త‌ర్వాత మ‌ళ్లీ ఇప్పుడు ఇదే సెట్ ను మార్చి సైరా కోసం వాడుకుంటున్నారు. ఇదే విష‌యం ప్ర‌భుత్వం దృష్టికి వెళ్లింది. దాంతో ఈ ప్లేస్ ను ఎలాంటి అనుమ‌తులు లేకుండా వాడేస్తున్నారని సీరియ‌స్ అయ్యారు. ఇన్నాళ్లూ చూసి చూడ‌న‌ట్లు వ‌దిలేసినా ఇప్పుడు మాత్రం సీరియ‌స్ అయ్యారు అధికారులు. వ‌చ్చీ వెంట‌నే అన్నీ తొల‌గించాల‌ని లేదంటే మొత్తాన్ని కూల్చేస్తామ‌ని చెప్పారు. మ‌రి దీనిపై చిరంజీవి ఎలా రియాక్ట్ అవుతాడ‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది. సైరా షూటింగ్ త్వ‌ర‌లోనే మ‌ళ్లీ అక్క‌డ జ‌ర‌గ‌నుంది. ప్ర‌స్తుతానికి చిరు బ్రేక్ లో ఉన్నాడు. యూర‌ప్ లో ఈ చిత్ర కొత్త షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. ఆ త‌ర్వాత మ‌ళ్లీ ఇదే సెట్ కు రానున్నారు.

More Related Stories