English   

ఆర్ఎక్స్ 100 ద‌ర్శ‌కుడికి క‌రోనా పాజిటివ్

Ajay Bhupathi
2020-08-13 17:02:18

ఆర్‌ఎక్స్‌ 100 వంటి హిట్‌తో తెలుగు చిత్రసీమ దృష్టిని ఆకర్షించాడు వర్మ శిష్యుడు అజయ్‌ భూపతి. అంత హిట్ కొట్టినా రెండో సినిమాని పట్టాలెక్కించడానికి మాత్రం ఎన్నో అడ్డంకులు ఎదుర్కొంటున్నాడు. ఆయన ‘మహా సముద్రం’ పేరుతో ఓ క్రేజీ మల్టీస్టారర్‌ను పట్టాలెక్కించాలని చూస్తున్నట్టు చాలా రోజులుగా ప్రచారం జరిగింది. ఈ కథ అనేక మంది హీరోల చుట్టూ తిరగ్గా చివరికి రవితేజ దగ్గరికి వెళ్ళిందని, ఆయన ముందు ఒప్పుకున్నా కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారని ఒక ప్రచారం. దీంతో ఇదే కథను విశ్వక్‌ సేన్‌ - కార్తికేయలతో కలిసి చేస్తున్నాడని కూడా వార్తలు వచ్చాయి. అలా రవితేజ మొదలు నాగచైతన్య దాకా అనేక మంది హీరోల చేతులు మారిన కధ శర్వానంద్‌ వద్దకు చేరి ఓకే అయింది. ప్ర‌స్తుతం ఆయన తన మ‌హా స‌ముద్రం అనే సినిమాకి సంబంధించిన ప‌నుల‌తో బిజీగా ఉన్నాడు ఆయన. అయితే తాజాగా ఆయన కరోనా బారిన పడ్డారు. ఇప్పటికే టాలీవుడ్ ఇండ‌స్ట్రీకి సంబంధించి ఇప్ప‌టికే ప‌లువురు దర్శకులు  ఇప్ప‌టికే క‌రోనా బారిన ప‌డ‌గా, తాజాగా అజ‌య్ భూప‌తికి కూడా క‌రోనా పాజిటివ్ అని నిర్ధార‌ణ అయింది. ఈ విష‌యాన్ని ఆయ‌నే త‌న ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌జేశారు. త్వ‌ర‌లో వ‌స్తా.. ప్లాస్మా ఇస్తా అంటూ చెప్పీ చెప్పకుండా ట్వీట్ చేశారు.

More Related Stories