English   

టాలీవుడ్ లో విషాదం...కరోనాతో యంగ్ డైరెక్టర్ మృతి

Vatti died
2021-05-01 11:55:13

సర్కారు వారి పాట టీమ్ లో విషాదం నెలకొంది. ఈ సినిమా కోసం పనిచేస్తున్న యంగ్ డైరెక్టర్ కుమార్ వట్టి కరోనాతో మరణించారు. సర్కారు వారి పాట సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న సమయంలో కుమార్ వట్టి కరోనా బారిన పడ్డారు. పరిస్థితి విషమంగా ఉండటంతో ఆయన ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. అయితే గురువారం ఆయనకు ప్లాస్మా థెరపీ చేస్తున్న సమయంలో కార్డియాక్ అరెస్ట్ అవ్వడం తో కన్ను మూశారు. వట్టి కుమార్ శ్రీకాకుళానికి చెందిన వాడు. శ్రీవిష్ణు హీరోగా "మా ఆబాయి" అనే సినిమాకు దర్శకత్వం వహించారు. ఇక ప్రస్తుతం సర్కారువారి పాట డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో పని చేస్తున్నారు. అంతే కాకుండా తన రెండో సినిమా కోసం ఓ బడా ప్రొడ్యూసర్ తో ఒప్పందం కూడా కుదుర్చుకున్నారు. ఇంతలోనే కుమార్ మృతి చెందటం బాధాకరం. ఇదిలా ఉండగా కరోనా మహమ్మారి వల్ల ఇండస్ట్రీ లో ఇప్పటికే ఎంతోమంది మరణించారు. నిన్న దర్శకుడు కేవీ ఆనంద్ కూడా కరోనాతో మృతి చెందారు.

More Related Stories