English   

టాలీవుడ్ లో అధికార ప్రతినిధులు

Telugu-Film-Chamber

గత కొన్నాళ్లుగా ఇండస్ట్రీలో జరుగుతోన్న పరిణామాలు చాలా వరకూ అక్కడి జనాల్ని ఇబ్బంది పెడుతున్నాయి. వీటికి తోడు మీడియా వైఖరిపైనా వారు చాలా డిస్ట్రబ్ అయ్యారు. అవుతున్నారు. దీనిపై ఓ దశలో మీడియాను బ్యాన్ చేయాలనే నిర్ణయమూ తీసుకుందాం అనుకున్నారు. కానీ మీడియా నుంచి విపరీతమైన వ్యతిరేకత రావడం.. అందుకు చాంబర్ నుంచి అందరు సభ్యులు అంగీకరించకపోవడం వల్ల.. బ్యాన్ కాస్తా కొన్ని ‘కండీషన్స్’ గా మారింది. అంటే ఇకపై కంటెంట్ విషయంలో కానీ, యాడ్స్ విషయంలో కానీ.. చాలా కండీషన్స్ ఉంటాయి. వాటికి చానల్స్ ఒప్పుకుంటేనే వారి మధ్య లావాదేవీలు జరుగుతాయి. లేదంటే ఎవరి ఇష్టం వారిది. ఇక ఇదే సందర్భంలో అటు సినిమా వారు కూడా చాలామంది ఎవరికి తోచింది వారు మాట్లాడుతున్నారు. ఇకపై అలాంటి సమస్యలు లేకుండా సినిమా పరిశ్రమకు సంబంధించి వారితో ఏ విషయమైనా మాట్లాడాలనుకుంటే.. ఎవరితో పడితే వారితో కుదరదు. అందుకోసం కొందరు ప్రతినిధులను నియమించారు. మొత్తం 13మంది సభ్యులున్న ఈ కమిటీయే పరిశ్రమకు సంబంధించిన వ్యవహారాలన్నీ మీడియాతో కానీ.. ఇతర వ్యక్తులతో కానీ మాట్లాడుతుంది. అలాగని ప్రతి విషయానికీ 13మందీ రావాల్సిన అవసరం లేదు. ఎవరిని సంప్రదించినా.. వారు చెప్పేదే పరిశ్రమ అభిప్రాయంగా పరిగణించాల్సి ఉంటుందన్నమాట.సినిమా ప‌రిశ్ర‌మ‌లోని ఏ విభాగం గురించైనా ఒక అంశంపై అధికారికంగా మాట్లాడ‌వ‌ల‌సి వ‌చ్చిన‌ప్పుడు ఈ క్రింది స‌భ్యుల‌ను, తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ ప‌క్షాన అధికారిక ప్ర‌తినిధులుగా తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ నియ‌మించింది.


1. పి. కిర‌ణ్ , అధ్య‌క్షులు , తెలుగు ఫిలిం ఛాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్

2. ముత్యాల రాందాస్, గౌర‌వ కార్య‌ద‌ర్శి, తెలుగు ఫిలిం ఛాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్

3.కె. ముర‌ళీ మోహ‌న్ అధ్య‌క్షులు, తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్

4. సునీల్ నారంగ్, గౌర‌వ కార్య‌ద‌ర్శి, తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్

5.డా.కె.ఎల్. నారాయ‌ణ‌, అధ్య‌క్షులు తెలుగు ఫిలిం ప్రొడ్యూస‌ర్ కౌన్సిల్

6. కొమ‌ర వెంక‌టేష్, అధ్య‌క్షులు , తెలుగు ఫిలిం ఇండ‌స్ర్టీ  ఎంప్లాయిస్ ఫెడ‌రేష‌న్

7. ఆర్. వెంక‌టేశ్వ‌ర‌రావు,  జ‌న‌ర‌ల్ కార్య‌ద‌ర్శి, తెలుగు ఫిలిం ఇండ‌స్ర్టీ  ఎంప్లాయిస్ ఫెడ‌రేష‌న్

8.ఎన్. శంక‌ర్, అధ్య‌క్షులు, తెలుగు ఫిలిం డైరెక్ట‌ర్స్ అసోసియేష‌న్ 

9.డా. న‌రేష్ వి.కె, జ‌న‌ర‌ల్ కార్య‌ద‌ర్శి, మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్

10. త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ‌

11. వి. వెంక‌ట‌ర‌మాణారెడ్డి (దిల్ రాజు)

12. బి.వి. నందిని రెడ్డి

13. ఝాన్సీ ల‌క్ష్మి య‌ల‌వ‌ర్తి

More Related Stories