English   

దర్శకుల వార్ ఒన్ సైడ్ అవుతోందా..?

Directors-Assosiation

ఎప్పుడూ లేని విధంగా తెలుగులో దర్శకుల సంఘం ఎన్నికలు ఈ సారి మరింత వేడిగా జరగబోతున్నాయి. ఇప్పటికే ఎవరి ప్యానెల్ కు సంబంధించి వారు స్ట్రాంగ్ గా ప్రచారాలు మొదలుపెట్టారు. అయితే వరస చూస్తోంటే వార్ ఒన్ సైడ్ అయ్యేలా ఉంది. అందుకు కారణం గతంలో పనిచేసిన సంఘమే అనేది ఇప్పుడు పోటీలో నిలుచున్న ప్యానెల్ చేస్తోన్న ఆరోపణలే. గత దర్శకుల సంఘం వారిపై కొత్తగా పోటీ చేస్తోన్న ప్యానెల్ ఘాటైన ఆరోపణలు చేస్తోంది. ముఖ్యంగా చిత్రపురి కాలనీలోని ఇళ్ల గురించి వారు చెబోతున్న మాటలు వేడిపుట్టిస్తున్నాయి. అలాగే అర్హత లేని వారికి దర్శకుల సంఘంలో సభ్యత్వం ఇచ్చారనేది మరో ప్రధాన ఆరోపణ. అయితే ఆరోపణల సంగతి ఎలా ఉన్నా.. ఆరోపణలు చేస్తోన్న ప్యానెల్ నుంచి దర్శకుడ ఎన్. శంకర్ గెలిచే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఎన్. శంకర్ కు మద్ధతుగా చాలామంది స్టార్ డైరెక్టర్స్ కూడా నిలవడం ఓ కారణమైతే.. దీని వెనక రాజకీయ కారణాలు కూడా మరో కోణంగా కనిపిస్తున్నాయి. 

ఎన్. శంకర్ తెలంగాణ వ్యక్తి. సినిమా పరిశ్రమ మనుగడ కానీ, రాయితీలు కానీ, ఇక్కడి ప్రభుత్వంపైనే ఆధారపడి ఉన్నాయి. పైగా తెలంగాణ ప్రభుత్వం పరిశ్రమ పట్ల చాలా ఉదారంగా ఉంటోంది. పర్మిషన్స్ కానీ, ఇతర వ్యవహారాలు కానీ.. ప్రాంతీయ భేదం లేకుండా చూసుకుంటోంది. ఇక ఎన్. శంకర్ కు ప్రభుత్వంలో ఉన్న చాలామంది పెద్దలతో సత్సంబంధాలున్నాయి. ఈ కారణంగానే శంకర్ గెలిచే అవాశాలున్నాయనేవారున్నారు. దీనికి చిత్రపురి కాలనీ వ్యవహారాలు, అనర్హులైన దర్శకుల సభ్యత్వం  మసాలాగా యాడ్ అయింది. మరోవైపు చాలామంది సీనియర్ డైరెక్టర్స్ శంకర్ కు మద్ధతుగా ఉన్నా.. రేపు హైదరాబాద్ లోని ఓ పెద్ద ఫంక్షన్ హాల్లో స్టార్ డైరెక్టర్స్ అంతా సమావేశం కాబోతున్నారు. ఇది ఎన్నికల వాతావరణాన్ని మరింత వేడెక్కిస్తుందనుకోవచ్చు. అయితే ఎలా చూసినా వార్ ఒన్ సైడ్ అయ్యేలానే ఉందనేది అందరూ చెబుతోన్న మాట. అంటే ఎన్. శంకర్ ప్యానెల్ గెలుస్తుందనుకోవచ్చేమో.. లేదంటే ఎన్నికలు కాబట్టి ఏమైనా జరగొచ్చు.. కానీ ఈ ఇష్యూలో తెలంగాణ ఫ్యాక్టర్ కూడా కీలక పాత్రగా ఉంటుందనేది నిజం. 

More Related Stories