English   

తెలుగు మీడియా చ‌చ్చిపోయింది..!

Telugu-media
2018-04-18 11:26:31

అవును.. ఇప్పుడు ప్రేక్ష‌కుల్లో వినిపిస్తున్న మాట ఇదే. ఒక‌ప్పుడు న్యూస్ ఛానెల్స్ అంటే న్యూస్ వ‌చ్చేవి. కానీ ఇప్పుడు న్యూసెన్స్ వ‌స్తున్నాయి. అన్నీ కాదు కానీ కొన్ని మాత్రం ప‌నిక‌ట్టుకుని మ‌రీ ప‌నికి మాలిన న్యూస్ ను ప్రేక్ష‌కుల‌పై రుద్దేస్తున్నాయి. అస‌లు అవ‌స‌రం లేని న్యూస్ తీసుకొచ్చి అరాచ‌కంగా ప‌బ్లిసిటీ చేస్తున్నాయి. మెరుగైన స‌మాజం కోసం అంటూ బీరాలు ప‌లికే ఆ ప్ర‌బుద్ధులు.. ప‌డ‌క‌గ‌ది య‌వ్వారాల‌ను కూడా ప‌బ్లిసిటీ కోసం వాడేస్తున్నారు. ఎవ‌రో బ‌జారున బ‌ట్ట‌లిప్పే వాళ్లను కూడా తీసుకొచ్చి స్టూడియోలో కూర్చోబెట్టి కాఫీలు ఇచ్చి మ‌రీ.. వాళ్ల‌ను ఎంక‌రేజ్ చేస్తూ టిఆర్పీ కోసం మీడియా బ‌ట్ట‌లు కూడా విప్పేస్తున్నారు. వీళ్లు చేస్తోన్న ఈ వెద‌వ ప‌నికి ప్రేక్ష‌కులు ఛీ కొట్టేది వాళ్ల‌ను మాత్ర‌మే కాదు.. మిగిలిన మీడియాను కూడా..! క‌ట్నం తీసుకునే వాడు గాడిద అని నీతులు చెప్పే ఆ మ‌హానుభావులు.. తాము చేస్తోన్న ప‌నులు మాత్రం అస్స‌లు చెప్ప‌రు. ఆ ఛానెల్ ఎండి అమ్మాయిని గెస్ట్ హౌజ్ కు ర‌మ్మ‌ని మెసేజ్ లు పెట్టినా అవి అబ‌ద్ధాలు అని ఆ రోజే చూపిస్తారు.  సినిమా వాళ్ల భాగోతాల‌ను మాత్రం ఆధారాలు లేక‌పోయినా బ‌ట్ట‌బ‌య‌లు చేస్తారు. కార‌ణం వాళ్ల రేటింగ్ కోసం అమానుషం. ఓ వైపు దేశంలో ఎన్నో ఘోరాలు జ‌రుగుతున్నా.. వాటిపై క‌నీసం ప‌ట్టించుకోని ఆ ఛానెల్ పెద్ద‌లు ఇక్క‌డ మాత్రం ఓ బోడిరెడ్డి కోసం గంట‌ల త‌ర‌బ‌డి డిస్క‌ష‌న్లు న‌డుపుతుంటారు. వాటికి మ‌ళ్లీ కొంద‌రు ప‌నిలేని మ‌హిళా సంఘాల నేత‌లు వ‌చ్చి మ‌ద్ద‌తు తెల‌ప‌డం.. ఛీ అంటూ తిట్టుకుంటున్నారు ప్రేక్ష‌కులు. ఆ ఒక్క ఛానెల్ కాకుండా ఇప్పుడు మ‌రో రెండు బ‌క‌రా ఛానెల్స్ కూడా ఆ బోడిరెడ్డి చెప్పే ప‌డ‌క‌గది ముచ్చ‌ట్ల‌ను సొల్లు కార్చుకుంటూ వింటున్నాయి. న్యాయం జ‌ర‌గాలంటే పోలీసుల ద‌గ్గ‌రికి వెళ్ల‌కుండా మీడియా హౌజుల చుట్టూ ఏమొస్తుందో  మ‌రి..! అస‌లు వాళ్ల‌కు కావాల్సింది న్యాయ‌మా..? లేదంటే బేర‌మా..? అనేది మాత్రం అస‌లర్థం కావ‌ట్లేదు. వీలైనంత త్వ‌ర‌గా ఈ ద‌రిద్రాన్ని చూసే ధౌర్భాగ్యాన్ని తీసేయాలంటూ కోరుకుంటున్నారు జ‌నం. 

More Related Stories