English   

ఈ సమ్మర్ చాలా టైట్ గురూ..

summer movies
2018-02-23 12:43:14

సమ్మర్ వస్తోందంటే చాలు.. సినిమావాళ్లు సరైన డేట్స్ కోసం నానా హైరానా పడుతుంటారు. వచ్చిన డేట్ లో పోటీ లేకుండా చూసుకోవడం మరో సమస్య. అందుకే వీలైనంత తొందరగా డేట్స్ ఫిక్స్ చేసుకుంటారు. మొత్తంగా మార్చి నుంచే ఈ సమ్మర్ సందడి మొదలవుతుంది. అందుకు తగ్గట్టే తమ సినిమాల రిలీజ్ డేట్స్ సెట్ చేసుకుంటారు మేకర్స్ .. మరి ఈ యేడాది వేసవిలో సందడి చేయబోతోన్న మాగ్జిమం కన్ఫర్మ్ అయిన సినిమాల లిస్ట్ ఇప్పుడు చూద్దాం..

ఫిబ్రవరిలో ఛలో, తొలిప్రేమ వంటి సినిమాలు సందడి చేశాయి. ఇక మార్చి నుంచి సమ్మర్ సందడి మొదలవుతుంది. ఈ సారి సమ్మర్ సంరంభం కిరాక్ పార్టీతో మొదలు కాబోతోంది. నిఖిల్ హీరోగా వస్తోన్న ఈ మూవీ కన్నడ మూవీ కిరిక్ పార్టీకి రీమేక్. ఆల్రెడీ వచ్చిన టీజర్, సాంగ్ తో ప్రామిసింగ్ గానే కనిపిస్తోందీ పార్టీ. మార్చి 16న కిరాక్ పార్టీతో వేసవి వేడి మొదలవుతుంది. 
ఆతర్వాత మార్చి 23న కళ్యాణ్ రామ్ ఎమ్మెల్యే వస్తోంది. ఉపేంద్ర మాధవ్ అనే కొత్త కుర్రాడు దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు. తన డెబ్యూ మూవీలో కళ్యాణ్ రామ్ తో రొమాన్స్ చేసిన హాఫ్ సెంచరీ కొట్టిన తర్వాత మరోసారి కళ్యాణ్ రామ్ తో జత కట్టిందీ సినిమాతో. ఎమ్మెల్యే అంటే మంచి లక్షణాలున్నఅబ్బాయి అని అర్థం. యాక్షన్ అండ్ పొలిటికల్ ఎంటర్టైనర్ గానూ వస్తోన్న ఈ మూవీపై కళ్యాణ్ రామ్ చాలా ఆశలు పెట్టుకున్నాడు.

ఇక సమ్మర్ వార్ అసలుగా మొదలుపెట్టేది మాత్రం రామ్ చరణ్ రంగస్థలం. సుకుమార్ దర్శకుడు. సమంత హీరోయిన్. 1980ల నాటి కథాంశంతో వస్తోన్న ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. అందుకు తగ్గట్టుగానే సినిమా కూడా వచ్చిందనే నమ్మకంతో ఉంది ఎంటైర్ యూనిట్. చరణ్, సుక్కు, సమంతలకు ఇదే ఫస్ట్ కాంబినేషన్. రామ్ చరణ్ చెవిటి వాడిగా, సమంత మూగ అమ్మాయిగా నటిస్తోందీ సినిమాలో. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన రంగస్థలం ఓ కొత్త ట్రెండ్ సెట్ చేస్తుందనే భావనలో ఉన్నారు ప్రేక్షకులు. అది నిజమా కాదా అనేది ఈ సినిమా విడుదల కాబోతోన్న మార్చి 30న తెలుస్తుంది. అయితే రంగస్థలం తర్వాత సమ్మర్ వార్ మరింత వేడెక్కడం ఖాయం.

ఏప్రిల్.. సమ్మర్ కు సిసలైన వేదిక. అందుకు అనుగుణంగా చాలా సినిమాలు కాంపిటీషన్ లో ఉన్నాయి. ప్రస్తుతం అర్జెంట్ గా హిట్ కొట్టాల్సిన స్టేజ్ లో ఉన్న నితిన్ ఛల్ మోహన రంగా ఏప్రిల్ 5న వస్తోంది. లై బ్యూటీ మేఘా ఆకాశ్ మరోసారి నితిన్ తో జత కట్టింది. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్, నితిన్ శ్రేష్ట్ మూవీస్  సంయుక్తంగా నర్మిస్తోన్న ఈ మూవీకి కథ అందించింది త్రివిక్రమ్ కావడం విశేషం. రౌడీఫెలో ఫేమ్ కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాపై కూడా మంచి అంచనాలే ఉన్నాయి. అయితే నితిన్ కు షాక్ ఇస్తూ ఆ నెక్ట్స్ డే అర్జున్ రెడ్డి వస్తున్నాడు. అయితే ఈ సారి టాక్సీవాలాగా.

అర్జున్ రెడ్డితో విజయ్ దేవరకొండ ఓవర్ నైట్ క్రేజీ స్టార్ అయ్యాడు. ఆ స్టార్డమ్ ను నిలబెట్టుకోవాలంటే ఖచ్చితంగా మరో హిట్ కొట్టాలి. ఆ హిట్ టాక్సీవాలాతో వస్తుందనే నమ్మకంతో ఉన్నాడీ యంగ్ స్టార్. ప్రియాంక జవాల్కర్ హీరోయిన్ గా పరిచయం అవుతోంది. గతంలో ది ఎండ్ అనే హారర్ మూవీ తీసిన రాహుల్ సాంకృత్యాయన్ టాక్సీవాలా ను డైరెక్ట్ చేస్తున్నాడు. పేరుకు టాక్సీవాలా అయినా ఇదొక సూపర్ నేచురల్ థ్రిల్లర్ అనే చెబుతున్నారు. అన్నిటికీ మించి ఇది యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో వస్తోన్న సినిమా కాబట్టి నితిన్ కు గట్టిపోటీ ఇవ్వడమే కాదు.. గ్యారెంటీ హిట్ అనే సౌండింగ్ నూ వినిపిస్తోంది.

ఆ నెక్ట్స వీక్ నాని వస్తున్నాడు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో మూడోసారి తను డ్యూయొల్ రోల్ చేసిన కృష్ణార్జున యుద్ధం ఏప్రిల్ 12న విడుదల కాబోతోంది. రెండు క్యారెక్టర్స్ పూర్తిగా డిఫరెంట్ గా ఉంటాయని చెబుతున్నారు. పైగా నాని మాంచి స్వింగ్ లో ఉన్నాడు. మేర్లపాక గాంధీ స్క్రీన్ ప్లే బావుంటుంది. కథలు చెప్పే విధానం ఆకట్టుకుంటుంది. అనుపమ పరమేశ్వరన్, రుక్సర్ మీర్ హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ మూవీలోని ఓ పాట ఇప్పుడు టాప్ ట్రెండింగ్ లో ఉంది. నాని హీరో కాబట్టి అంచనాలే కాదు.. ఓపెనింగ్స్ కూడా బానే ఉంటాయి.

ఇప్పటి వరకూ రిలీజ్ డేట్ కోసం యుద్ధం చేసిన ఇద్దరు హీరోలు విడిపోయారు. మహేష్ బాబు, అల్లు అర్జున్. ఇద్దరరూ ఏప్రిల్ 26నే రావాలని బెట్టుచేశారు. కానీ ఇండస్ట్రీ పెద్దలు మేటర్ సెటిల్ చేశారు. దీంతో మహేష్ బాబు ఏప్రిల్ 20నే ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న భరత్ అనే నేను ఏప్రిల్ 20న విడదలవుతుంది. మహేష్ బాబు శ్రీమంతుడు తర్వాత కొరటాలతో చేస్తోన్న సినిమా కాబట్టి అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ మూవీలో మహేష్ బాబు సిఎమ్ గా కనిపిస్తాడు.

ఇక మహేష్, అర్జున్ గొడవపడిన డేట్ పూర్తిగా ఖాళీ అయింది. దీంతో కాలా ఆ ఖాళీని భర్తీ చేస్తున్నాడు. సూపర్ స్టార్ రజినీకాంత్.. కబాలి ఫేమ్ పా. రంజిత్ డైరెక్షన్ లో ధనుష్ నిర్మించిన ఈ మూవీ ఏప్రిల్ 27న విడుదల కాబోతోంది. 
ఇక ఏప్రిల్ 26కోసం తెగ ఇదైపోయిన అల్లు అర్జున్ ఏకంగా మే నెలకు వెళ్లిపోయాడు. మే 4న అల్లు అర్జున్ నా పేరుసూర్య నా ఇల్లు ఇండియా విడుదల కాబోతోంది. ఇన్నాళ్లూ స్టార్ రైటర్ గా ఉన్న వక్కంతం వంశీ ఈ సినిమాతో మెగాఫోన్ పడుతున్నాడు. అనూ ఇమ్మానుయేల్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ మూవీపైనా భారీ అంచనాలున్నాయి. అవి నిలబెట్టుకునేందుకు ఎంటైర్ టీమ్ విపరీతంగా కష్టపడుతోంది.

అల్లు అర్జున్ వచ్చిన తర్వాతి వారమే బెల్లంకొండ కుర్రాడు సాయి శ్రీనివాస్ సాక్ష్యంతో దిగుతున్నాడు. సాక్ష్యం మే 11న విడుదలవుతోంది. శ్రీవాస్ డైరెక్షన్ లో వస్తోన్న ఈ మూవీలో పూజా హెడ్గే హీరోయిన్. థ్రిల్లర్ కాన్సెప్ట్ అని చెబుతోన్న ఈ మూవీ రేంజ్ తెలియడానికి మరికొంత టైమ్ పడుతుంది. ఇక ఒక్క హిట్ కోసం చకోర పక్షిలా చూస్తోన్న గోపీచంద్ కూడా సమ్మర్ బరిలో ఉన్నాడు. ప్రస్తుతం సైలెంట్ గా షూటింగ్ జరుపుకుంటోన్న పంతం అనే సినిమా మే 18న వస్తోంది. కె. చక్రవర్తి ఈ చిత్రానికి దర్శకుడు. హెహ్రీన్ కౌర్ హీరోయిన్. ప్రస్తుతం ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్న ఈ మూవీకి సంబంధించి అప్డేట్స్ ఇంకా రావాల్సి ఉంది. 
ఇక ఈ సమ్మర్ వార్ ఫినిషింగ్ ఇచ్చేది మాత్రం అక్కినేని హీరో. నాగచైతన్య.. మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్ చందు మొండేటి కాంబినేషన్ లో వస్తోన్న సవ్యసాచి మే 25న వస్తోంది. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ మూవీలో నిన్నటి సౌత్ రొమాంటిక్ హీరో మాధవన్ విలన్ గా నటిస్తుండటం విశేషం. మొత్తంగా ఇదీ సమ్మర్ లో విడుదల కాబోతోన్న సినిమాల షెడ్యూల్. ఇందులో దాదాపు ఏ మార్పూ ఉండకపోవచ్చు. కానీ కొన్ని సినిమాలు కొత్తగా యాడ్ అయ్యే అవకాశం ఉంది. వాటిలో ముఖ్యంగా సావిత్రి బయోపిక్ మహానటి, పూరీ జగన్నాథ్ సొంత సినిమా మెహబూబా, కళ్యాణ్ రామ్, తమన్నా కాంబినేషన్ లో వస్తోన్న నా నువ్వే వంటి సినిమాలు ఏదో ఒక డేట్ లో వచ్చేయొచ్చు.. మరి వీటిలో ఎన్ని సినిమాలు బాక్సాఫీస్ వార్ లో గెలుస్తాయో కానీ.. ఈ సమ్మర్ మాత్రం చాలా టైట్ షెడ్యూల్ తో మరింత హాట్ గా మారబోతోందనేది మాత్రం నిజం.. 

More Related Stories