English   

థియేటర్స్  ఓపెన్ అవుతున్నాయ్..

Telugu-Theaters
2018-03-06 14:37:32

డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్స్ వసూలు చేస్తోన్న చార్జీలను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ గత కొన్ని రోజులుగా ఫిల్మ్ చాంబర్, ఎగ్జిబిటర్స్, చేస్తోన్న  థియేటర్స్ బంద్ ముగింపు దశకు వచ్చింది. ఈ మేరకు డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్స్, చాంబర్ కు మధ్య జరుగుతున్న చర్చలు ఓకొలిక్కి  వచ్చినట్టే. బంద్ మొదటి నుంచి సర్వీస్ చార్జ్ ను ఎత్తివేయాలనే డిమాండ్ తో ఉన్నారు ఎగ్జిబిటర్స్. కానీ అలా చేయడం సాధ్యం కాదని ఖచ్చితంగా చెప్పారు సర్వీస్ ప్రొవైడర్స్ .. ఈ నేపథ్యంలో మొదలైన బంద్ ప్రస్తుతం ప్రీ క్లైమాక్స్ లో ఉంది. వీరి మధ్య జరుగుతున్న చర్చల ఫలితంగా ఇప్పటి వరకూ 17శాతం సర్వీస్ చార్జ్ తగ్గించేందుకు ప్రొవైడర్స్ ఒప్పుకున్నారు. అయితే ఇంకా తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు ఎగ్జిబిటర్లు. ఈ నేపథ్యంలో కొంత సస్పెన్స్ ఉన్నా సాయంత్రం వరకూ అవి కూడా క్లియర్ అయ్యే అవకాశాలున్నాయి. 

ఇక ఇప్పటి వరకూ తెలుగు రాష్ట్రాల్లో డిజిటల్ స్క్రీనింగ్ ను శాసిస్తోన్న క్యూబ్, విఎఫ్ఎక్స్, పిఎక్స్ల్ఎల్ సంస్థలు ఎగ్జిబిటర్ల డిమాండ్ కు చాలా వరకూ తలొంచాయి. కానీ చేసుకున్న ఒప్పందం ప్రకారం ఆ సర్వీస్ చార్జ్ ను పూర్తిగా తొలగించాలి. కానీ పెరిగిన ఖర్చుల నేపథ్యలో అలా చేయడం సాధ్యం కాదని వీరు చెబుతున్నారు.అందుకే మొదట్లో ఏడు, ఎనిమిది శాతం నుంచి మొదలైన చర్చలు ఫైనల్ గా 17శాతం ఒప్పందంతో ముగిసిపోయే అవకాశం ఉంది. దీనికి సంబంధించి రేపు అగ్రిమెంట్స్ కూడా అవ్వొచ్చు. అలాగే రాబోయే కాలంలో మళ్లీ ఇలాంటి సమస్యలు తలెత్తకుండా కొత్తగా మరికొన్ని అగ్రిమెంట్స్ కూడా వీరి మధ్య కుదిరే అవకాశం ఉంది. ఈ మొత్తం తంతు పూర్తి చేసుకున్న తర్వాత శుక్రవారం నుంచి బంద్ కు కాల్ ఆఫ్ ప్రకటించబోతున్నారు. 

మొత్తంగా ఈ నెల 2నుంచి నిరవధికంగా జరుగుతోన్న బంద్ విజయవంతంగా ముగియబోతుందనే అనుకోవచ్చు. అయితే ఇప్పటికిప్పుడు కొత్త సినిమాలు లేవు కాబట్టి, శుక్రవారం విడుదలయ్యే సినిమాలతో మళ్లీ థియేటర్స్ కొత్త బొమ్మలతో మొదలవుతాయి. కానీ ఈ లోగానే కొన్ని థియేటర్స్ ఓపెన్ అయ్యే అవకాశమూ లేకపోలేదు. ఇప్పటికే కొన్ని థియేటర్స్ లో బుక్ మై షో ద్వారా టికెట్స్ అమ్ముతున్నాయి. దీన్ని బట్టే సర్వీస్ చార్జ్ 17శాతం తగ్గించే ఒప్పందం పూర్తయినట్టే అనుకోవచ్చు. 

More Related Stories