English   

 థ‌మ‌న్ ఇలా కొట్టేస్తున్నాడేంటి..? 

thaman-nithiin

ఎప్పుడూ రొటీన్ మ్యూజిక్ ఇస్తాడు.. ఇవే పాట‌లు ఎన్నిసార్లు కొడ‌తాడు.. అంటూ థ‌మ‌న్ ను విమ‌ర్శించేవాళ్లంతా. అత‌డు మ్యూజిక్ ఇస్తే ఏదో తూతూ మంత్రంగా పూర్తి చేస్తాడు.. లేజీగా ఉంటాడు అనే పేరుంది. ఇన్నాళ్లూ ఆయ‌న పాట‌లు వినే వాళ్లు కూడా ఇది నిజం అని ఒప్పుకోలేని ప‌రిస్థితి. కానీ ఇప్పుడు ఆయ‌న మారిపోయాడు. ఒక్క సినిమాతో అంచ‌నాల‌న్నీ త‌ల‌కిందులు చేసాడు థ‌మ‌న్. అదే తొలిప్రేమ‌. ఈ సినిమా ఈ రోజు ఇంత పెద్ద విజ‌యం సాధించిందంటే దానికి కార‌ణం థ‌మ‌న్ కూడా. ప్ర‌తీ సీన్ ను.. ప్ర‌తీ ఫ్రేమ్ ను త‌న ఆర్ఆర్ తో మ‌రో లెవ‌ల్ కు తీసుకెళ్లాడు ఈ సంగీత ద‌ర్శ‌కుడు. వెంకీ అట్లూరి రాసుకున్న అంద‌మైన ప్రేమ‌క‌థ‌కు త‌న అంద‌మైన సంగీతాన్ని తోడు చేసి.. శిల్పానికి ప్రాణం పోసాడు థ‌మ‌న్. మిగిలిన సినిమాల మాదిరి ఆ మాస్ రొటీన్ మ్యూజిక్ కాకుండా.. ఎక్క‌డో తెలియ‌ని కొత్త ఫీల్ తీసుకొచ్చాడు థ‌మ‌న్. నిజంగా ఈ పాట‌లిచ్చింది థ‌మ‌నేనా అనే అనుమానం అయితే క‌చ్చితంగా వ‌స్తుంది. 

ఇకిప్పుడు ఛ‌ల్ మోహ‌న్ రంగాకు కూడా థ‌మ‌న్ మాయ చేస్తున్నాడు. ఇందులో పాట‌ల‌కు అదిరిపోయే రెస్పాన్స్ వ‌చ్చింది. ఇప్పుడు చ‌ల్ మోహ‌న్ రంగా ప్రీ రిలీజ్ వేడుక‌లో థ‌మ‌న్ గురించి ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం బ‌య‌ట‌పెట్టాడు ప‌వ‌న్. ఖుషీ సినిమాలోని ఏ మేరా జ‌హా పాట‌కు ట్యూన్ ఇచ్చింది థ‌మ‌న్ అని చెప్పాడు ప‌వ‌ర్ స్టార్. మ‌ణిశ‌ర్మ ద‌గ్గ‌ర అప్ప‌ట్లో చాలా ఏళ్ళ పాటు ప‌ని చేసాడు థ‌మ‌న్. అప్పుడు ఈయ‌నే ఈ పాట‌కు సంగీతం అందించాడ‌ని ఛ‌ల్ మోహ‌న్ రంగా ప్రీ రిలీజ్ లో చెప్పాడు ప‌వ‌ర్ స్టార్. ప్ర‌స్తుతం ఈ కుర్ర సంగీత ద‌ర్శ‌కుడు ఎన్టీఆర్-త్రివిక్ర‌మ్ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ త్వ‌ర‌లోనే మొద‌లు కానుంది. ఎన్నాళ్ల నుంచో థ‌మ‌న్ నుంచి కోరుకునేది ఇదే క‌దా.. ఈ కొత్త‌ద‌నం వ‌ర్క‌వుట్ అయితే థ‌మ‌న్ కెరీర్ మ‌ళ్లీ గాడిన ప‌డిన‌ట్లే..!  
 

More Related Stories