English   

ఆ దర్శకుడు థమన్ ను వదలడం లేదుగా..?

akhil-thaman

ఏ సినిమాకైనా సంగీతం కీ రోల్ ప్లే చేస్తుంది. ఇక ఫీల్ గుడ్ లవ్ ఎంటర్టైనర్స్ లో ఈ మ్యూజిక్ ది మేజర్ షేర్ ఉంటుంది. అలా ఉంటేనే ఈ ఫీల్ ఆడియన్స్ కు క్యారీ అవుతుంది. ఈ విషయంలో కొంతకాలం క్రితం వీక్ గా ఉన్నా.. లాస్ట్ ఇయర్ నుంచి దుమ్మురేపుతున్నాడు థమన్. ఇక పాటల సంగతి ఎలా ఉన్నా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో థమన్ ఫస్ట్ నుంచీ స్ట్రాంగ్ గానే ఉన్నాడు. వరుణ్ తేజ్ మూవీ తొలిప్రేమకు బిగ్గెస్ట్ అస్సెట్ థమన్ సంగీతమే అంటే అతిశయోక్తి కాదు. ఆ సినిమా దర్శకుడు వెంకీ అట్లూరికి ఇది ఫస్ట్ మూవీ అయినా.. థమన్ సహకారంతో అతను కూడా మంచి అవుట్ పుట్ ఇవ్వగలిగాడు. దీంతో ఈ దర్శకుడు తన నెక్ట్స్ మూవీకి కూడా థమన్ నే తీసుకుంటున్నాడు.  వెంకీ అట్లూరి ఇప్పుడు అఖిల్ తో సినిమా చేస్తున్నాడు. ఇది కూడా ప్యూర్ లవ్ స్టోరీ అంటున్నారు. దీంతో తనకు వచ్చిన ఫస్ట్ హిట్ కు బెస్ట్ అవుట్ పుట్ ఇచ్చిన థమన్ నే ఈ ప్రాజెక్ట్ కూ తీసుకుంటున్నాడు వెంకీ. ఈ సినిమాపై అఖిల్ కు చాలా హోప్స్ ఉన్నాయి. ఈ మూవీ రిజల్ట్ కాస్తా అటూ ఇటైతే మాత్రం అతని కెరీర్ కు ప్రమాదం అవుతుంది. కానీ తొలిప్రేమ చూసిన ఎవరైనా వెంకీకి ఇది గాలివాటం హిట్ కాదని తెలుస్తుంది. అతను ప్రతిభావంతుడే అన్న విషయం అర్థం అవుతుంది. ఆ ప్రతిభను మరోసారి అఖిల్ సినిమాకూ చూపితే.. ఖచ్చితంగా హిట్ గ్యారెంటీ. ఏదేమైనా థమన్, అఖిల్ కు ఫస్ట్ టైమ్ మ్యూజిక్ ఇవ్వబోతున్నాడు. మరి ఈ కాంబినేషన్ ఎలా ఉంటుందో చూడాలి. ఈ మూవీ త్వరలోనే సెట్స్ పైకి వెళ్లబోతోంది. 

More Related Stories