English   

తమన్ కు మరో బంపర్ ఆఫర్.. మెగాస్టార్ సినిమాకి మ్యూజిక్..

Thaman
2021-01-20 16:53:21

తమన్ నీ టైం నడుస్తుంది నడిపించు.. ప్రస్తుతం ఇదే అనిపిస్తుంది చూస్తుంటే. అల వైకుంఠపురములో సినిమాతో తెలుగులో నెంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయాడు తమన్. 100 సినిమాల తర్వాత ఈయన రేంజ్ మరింత పెరిగిపోయింది. ఇన్నేళ్లుగా ఎన్ని సినిమాలకు సంగీతం అందించినా కూడా ఈయనకు కాపీ క్యాట్.. రొటీన్ మ్యూజిక్ డైరెక్టర్ అనే పేరుండేది. కానీ అల వైకుంఠపురములో తర్వాత తమన్ రేంజ్ పెరిగిపోయింది. ఈ సినిమాకు తొలి విజయం చేకూరేలా చేసింది తమనే. ఎందుకు మీరు టికెట్ కొనరు అంటూ ప్రశ్నించేలా తన సినిమాకు సంగీతం అందించిన తమన్ కు చేతులెత్తి నమస్కరించాడు త్రివిక్రమ్ శ్రీనివాస్.

గత మూడేళ్లుగా మహానుభావుడు, తొలిప్రేమ, ఛల్‌ మోహన్‌రంగ, అరవింద సమేత వీర రాఘవ, అల వైకుంఠపురంలో, సోలో బ్రతుకే సో బెటరూ సినిమాలు తనకు మంచి పేరు తీసుకొచ్చాయని చెప్పుకొచ్చాడు సంగీత దర్శకుడు తమన్‌. వెంకీ మామ, ప్రతిరోజూ పండగే, అల వైకుంఠపురములో సినిమాలతో మరోసారి తన సత్తా చూపించాడు ఈయన. మొన్న సంక్రాంతికి విడుదలైన క్రాక్ సినిమాకు కూడా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. మరీ ముఖ్యంగా ఈ సినిమాలో బ్యాక్ గ్రౌండ్ స్కోరు అదిరిపోయింది పేరు వచ్చింది. తమన్ చేతిలో ప్రస్తుతం 10 సినిమాలు ఉన్నాయి.

ఈయన జోరు చూస్తుంటే ఏడాదికి 15 సినిమాలకు సంగీతం అందించేలా కనిపిస్తున్నాడు. ఇదిలా ఉంటే ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి సినిమాకు కూడా సంగీతం అందించబోతున్నాడు. మోహన్ రాజా దర్శకత్వంలో చిరు నటించబోయే లూసిఫర్ రీమేక్ సినిమాకు తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ట్వీట్ చేశాడు. ప్రతి సంగీత దర్శకుడికి చిరంజీవితో పని చేయడం ఒక కల లాంటిది.. ఆ డ్రీమ్ ఇప్పుడు నాకు నెరవేరుతుంది అంటూ ట్వీట్ చేశాడు. గతంలో బ్రూస్ లీ సినిమాలో చిరంజీవి ఎంట్రీ సీన్ కు అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు తమన్. దాంతో పాటు సైరా మోషన్ పోస్టర్ కు కూడా తమన్ సంగీతం అందించాడు. ఇప్పుడు చిరు సినిమాకి పూర్తిస్థాయిలో సంగీతం అందించబోతున్నాడు ఈయన. ఇది కాకుండా తమ చేతిలో వకీల్ సాబ్, పవన్ రానా మల్టీస్టారర్, మహేష్ బాబు సర్కారు వారి పాట సహా మరో 8 సినిమాలున్నాయి. 

More Related Stories