English   

మజిలీ నుండి గోపీ అవుట్...తమన్ ఇన్ !

Thaman
2019-03-20 12:40:35

నాగ చైతన్య, సమంతా హీరో హీరోయిన్స్ గా నిన్ను కోరి ఫేం శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా మజిలీ. వైజాగ్ నేపధ్యంలో క్రికెట్ కి ముడిపడిన లవ్ స్టోరీగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే షూటింగ్ అంతా పూర్తి చేసుకున్న ఈ సినిమా వచ్చే నెల ఐదున రిలీజ్ కావాల్సి ఉంది. అందుకే శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేస్తున్నారు సినిమా యూనిట్, అయితే ప్రస్తుతానికి ఈ సినిమాకి సంబందించిన ఒక విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అదేంటంటే ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా ఉన్న మళయాళ శబ్ద మాంత్రికుడు గోపీ సుందర్ ఈ సినిమా నుండి తప్పుకున్నాడట. అయితే ఇంకా సినిమాలో ఆర్ఆర్ వర్క్ పెండింగ్ ఉండడంతొహ్ మరో దర్శకుడు తమన్ ని చిత్ర బృందం సంప్రదించిందని ప్రస్తుతం తమన్ సారధ్యంలో ఈ ఆర్ఆర్ ప్యాచ్ వర్క్ జరుగుతుందని అంటున్నారు. నిజమెంతో తెలీదు కానీ సినిమాకి పాటలు మొత్తం ఇచ్చేసాక ఆయన ఎందుకు తప్పుకున్నాడు అనేది మాత్రం పలు చర్చలకు దారి తీస్తోంది. ఈ సినిమాలో చై, సామ్ లతో పాటు బాలీవుడ్ నటి దివాంశ కౌశిక్ నటిస్తోంది. హరీష్ పెద్ది, సాహి గారపాటిలు నిర్మిస్తున్న ఈ సినిమా మీద మంచి అంచనాలే ఉన్నాయి, పెళ్లి తర్వాత చైతన్య, సమంతా నటిస్తున్న మొదటి సినిమా కావడం, అలాగే శివ గత సినిమా నిన్ను కోరి బ్లాక్ బస్టర్ సాదించడంతో ఈ సినిమా మీద భారీ అంచనాలే నెలకొన్నాయి, ఏమి చేస్తారో చూడాలి మరి.

More Related Stories