అనసూయ థ్యాంక్ యూ బ్రదర్ ట్రైలర్ టాక్

అనసూయ భరద్వాజ్, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న చిత్రం 'థ్యాంక్ యూ బ్రదర్'. లేటెస్ట్ గా ఈ సినిమా ట్రైలర్ ను టాలీవుడ్ యాక్టర్ వెంకటేశ్ విడుదల చేశాడు. ట్రైలర్ విడుదలైంది. చిత్రయూనిట్ సభ్యులందరికీ ఆల్ ది బెస్ట్ అని వెంకటేశ్ ట్వీట్ చేశాడు. ఇప్పుడు ఈ ట్రైలర్ లో కరోనా లాక్ డౌన్ లో నిండు గర్భిణి అయిన ప్రియ(అనసూయ) - ఓ యువకుడు(విరాజ్) లిఫ్ట్ లో వెళ్తుండగా సడెన్ గా షార్ట్‌సర్క్యూట్ అవుతుంది. అదే సమయంలో ప్రియకు నొప్పులు మొదలై అపస్మారక స్థితిలోకి వెళ్లిపోతుంది. అప్పటికే ప్రియతో గొడవ పడిన ఆ యువకుడు అప్పుడు ఏం చేశాడు? వారు అక్కడి నుంచి ఎలా బయట పడ్డారు? అనేది సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి.
జస్ట్ ఆర్డినరీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై మాగుంట శరత్ చంద్రారెడ్డి, తారక్నాథ్ బొమ్మిరెడ్డి సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమాను నూతన దర్శకుడు రమేష్ రాపర్తి రూపొందిస్తున్నారు. సురేష్ రగుతు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తుండగా, గుణ బాలసుబ్రమణియన్ బ్యాగ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు.