English   

తరుణ్ భాస్కర్ తప్పు చేశాడా..? తట్టుకోలేకపోతున్నాడా..?

Tharun-Bhascker
2018-07-01 08:12:04

తరుణ్ భాస్కర్ తట్టుకోలేకపోతున్నాడా..? ఈ నగరానికి ఏమైంది.. సినిమాకు అనుకున్నంత హైప్ రాలేదని ఫీలవుతున్నాడా..? అంటే అవుననే చెప్పాలి. నిజానికి ఈ కథలో కాన్ ఫ్లిక్ట్ లేదు. అందరూ రిలేట్ చేసుకునే నేపథ్యం కాదు.. ఇంట్రెస్టింగ్ గానూ చెప్పలేకపోయాడు. ఏవో నాలుగు నవ్వుల పండించినంత మాత్రం అవి గొప్ప సినిమాలు కాలేవు కదా. ఇదే ఈ సినిమాకు సంబంధించి రివ్యూస్ లో చెప్పారు చాలామంది. కానీ ఈ నెగెటివ్ రివ్యూస్ ను అతను తట్టుకోలేకపోతున్నాడు. తానేదో కళాఖండం తీస్తే అది జనాలకు చేరకుండా రివ్యూవర్స్ అడ్డుకున్నాడనే అక్కసుతో ఉన్నాడు అనేలా ఓ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. బట్ అతనికి సోషల్ మీడియాలో అకౌంట్స్ లేవు. అయినా ఇదెలా చక్కర్లు కొడుతోంది అంటే దాని నేపథ్యం ఓ సారి చూద్దాం.. 

పెళ్లి చూపులు సినిమాతో ఎంటైర్ ఇండస్ట్రీ ఒక్కసారిగా తనవైపు చూసుకునేలా చేసిన దర్శకుడు తరుణ్ భాస్కర్. ఈ సినిమాతో ఓ టాలెంటెడ్ యంగ్ డైరెక్టర్ ఇండస్ట్రీకి వచ్చాడని ప్రతి ఒక్కరూ పొగిడారు. అటు మీడియా కూడా ఈ సినిమాపై విపరీతమైన ప్రశంసలు కురిపించింది. రివ్యూస్ అండ్ క్రిటిక్స్ అంతా పెళ్లి చూపులుకు బిగ్గెస్ట్ సపోర్ట్ గా నిలిచారు. ఇవన్నీ ఎందుకంటే ఆ సినిమా బావుంది కాబట్టి. చూసిన ప్రతి ఒక్కరికీ ఇది హానెస్ట్ ఎటెంప్ట్ అండ్ గుడ్ నెరేషన్ అనిపించింది కాబట్టి. అందుకే సినిమాను ఎంకరేజ్ చేశారు. కొత్త దర్శకుడిని పొగడ్తల్లో ముంచెత్తారు. అయితే అవన్నీ పూర్తిగా తలకెక్కాయో లేక తనను తాను ఓ గోప్ప దర్శకుడిని అని ఫీలవుతున్నాడో కానీ.. లేటెస్ట్ గా వచ్చిన అతని సినిమా ఈ నగరానికి ఏమైంది మాత్రం పెద్దగా ఆకట్టుకోలేదు. సరే గేమ్ ఇవన్నీ కామన్. కానీ తరుణ్ భాస్కర్ దాన్ని కామన్ తీసుకున్నట్టు లేడు. అందుకే రివ్యూస్ అండ్ రివ్యూవర్స్ పై విపరీతమైన విషం వెల్లగక్కాడు. 

‘‘ ఏదో ఒక రోజు సినిమా సమీక్షల మీద సమీక్ష రాస్తానేమో? సమీక్షలు రాసే వాళ్లంతా దారుణమైన అర్హత లేని జనాలు. కనీసం సినిమా అప్రియేషన్ కోర్సు లాంటిది చేసిన వారు మాత్రమే సమీక్షలు రాస్తే బాగుంటుందేమో? సమీక్షలు రాసేవారికి స్క్రీన్ ప్లే రైటింగ్, ఇతర విషయాల మీద అవగాహన సున్నా. వాళ్లంతా ఏమాత్రం మెచ్యూరిటీ లేనివాళ్లు’’. తరుణ్ భాస్కర్ చేసినట్టుగా ఓ అతని పేరుపై ఈ మాటలతో ఓ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అఫ్ కోర్స్ ఆ ట్వీట్ పై ఉన్న ఫోటో కూడా అతనిదే. అయితే అతను సోషల్ మీడియాలో లేడు. అంటే ట్విట్టర్, ఫేస్ బుక్ లాంటివి వాడడు. అయినా అతని పేరుపై వైరల్ అవుతోన్న ఈ ట్వీట్ మాత్రం చాలామందికి కోపం తెప్పిస్తోంది. కారణం.. అతని తొలి సినిమా బావుందని చెప్పినప్పుడు సంబురపడి.. ఇప్పుడు మాత్రం ఇలా మాట్లాడతాడా.. అంటూ చాలామంది ఫైర్ అవుతున్నారు.

తరుణ్ భాస్కర్ ట్వీట్ నిజమా కాదా అనేది పక్కన బెడితే ఈ మధ్య ప్రతి ఒక్కరూ రివ్యూస్ అండ్ రివ్యూవర్స్ పై తెగ ఎగురుతున్నారు. ఏ ఈ యేడాదే వచ్చిన రంగస్థలం, భరత్ అనేనేను, మహానటి, అభిమన్యుడు వంటి సినిమాలు అద్భుతంగా ఉన్నాయని చెప్పారు కదా. బాలేని సినిమాను బాలేదని చెబితే వీళ్లంతా తప్పువు వ్యక్తులా.. ఏం తెలియకుండానే రాస్తున్నారు అని చెప్పేవారు అన్నీ తెలిసే సినిమాలు తీస్తున్నారా అనేది చూసుకుంటే బావుంటుందేమో. కొన్ని సినిమాలకు డబ్బులు వచ్చి ఉండొచ్చు. అంత మాత్రాన అవి గొప్ప సినిమాలు అంటే ఎవరూ ఒప్పుకోరు. ఒకవేళ.. డబ్బులే ప్రామాణికం అయితే బి గ్రేడ్ సినిమాలకూ డబ్బులు వస్తాయి.. అంటే అవి కూడా గొప్ప సినిమాలే అనుకోవాలా. కంటెంట్ లో కొత్తదనం ఉండదు, ప్రెజెంటేషన్ లో ఫ్రెష్ నెస్ ఉండదు, ఎంచుకున్న పాయింట్ లో నిజాయితీ ఉండదు. అయినా తాము తీసేవి కళాఖండాలే అని ఫీలవుతున్నారు చాలామంది మేకర్స్ .. అవి వారు తీసిన సినిమా కాబట్టి అలా అనుకోవడంలో తప్పు లేదు. కానీ ప్రతి ఒక్కరూ వారి అభిప్రాయాన్నే కలిగి ఉండాలి అనుకోవడం అవివేకం. అంతకు మించి మూర్ఖత్వం. ఇప్పటి వరకూ ప్రపంచ సినిమా చరిత్రలో విమర్శను ఎదుర్కోని మేకర్ లేడు. వాళ్లంతా ఇలా విషం వెల్లగక్కి ఉంటే తర్వాత గొప్ప సినిమాలు తీసి ఉండేవారు కాదు. ఈ విషయం అవగాహన చేసుకుని.. ఆనక సినిమాలు చేస్తే బావుంటుంది. 

More Related Stories