English   

ఆడామగా తేడాలేని ‘డైరెక్టర్’..

The-director
2018-04-09 17:47:31

ఆ దర్శకుడు డైరెక్టర్ కు తక్కువ, సైకోకు ఎక్కువ. ఆడవాళ్లతో ఆడుకోవడం అతనికి ప్యాషన్. ఆ విషయంలో అసలు వీడికి ఆడామగా తేడాయే లేదు. అంతటి కామాంధుడు. పోనీ టాలెంటెడా అంటే అదీ కాదు. వేరే వాళ్ల స్క్రిప్ట్స్ దొబ్బేయడం.. తనవని చెప్పుకోవడం.. ఇతగాడికి ఇంకో క్వాలిటీ కూడా కాంట్రవర్శీస్ లో కింగ్. ఏ విషయాన్నైనా కాంట్రవర్శీ చేయడంలో ఆ డైరెక్టర్ ను మించిన వారు లేరు. ఇన్ని క్వాలిటీస్ చెప్పిన తర్వాత అతనెవరు అని అడక్కర్లేదు. ఎందుకంటే అతను ఫిక్షన్. యస్.. ఇదంతా ‘ద డైరెక్టర్’ అనేపేరుతో వస్తోన్న ఓ సినిమాలోని క్యారెక్టర్ ను పరిచయం చేసే విషయాలు. ఇవాళ ఈ మూవీ టీజర్ విడుదలైంది. ఇందులో కొన్ని విషయాలు పచ్చిగా చెప్పినా క్రియేటివ్ గా చెప్పారనిపించారు.. కాస్టింగ్ కౌచ్ కు నో చెబితే మిమ్మల్ని స్ట్రిక్గ్ గా నెయిల్డ్ చేస్తారు. ఓకే చెబితే మాత్రం మీరు సిక్ట్సీ నైన్డ్(69పొజిషన్ ను ఉద్దేశిస్తూ) అంటూ వచ్చిన కొటేషన్స్ సెటైరిక్ గా ఉన్నాయి. టీజర్ చూసిన తర్వాత ఇది ఫలానా దర్శకుడిని ఉద్దేశిస్తూ చేసిందే అనిపిస్తే తప్పేం లేదు. వరస చూస్తే వీరికి కావాల్సింది కూడా అదే అనిపిస్తోంది. బట్.. ఇలా ఇన్ ‘డైరెక్ట్’ ఓ డైరెక్టర్ ను టార్గెట్ చేయడం టాలీవుడ్ బహుశా ఇదే ఫస్ట్ టైమేమో.. మరి ఈ డైరెక్టర్ ద్వారా ఎఫెక్ట్ అయ్యే డైరెక్టర్ ఎవరైనా నోరు మెదుపుతారో లేక.. గుమ్మడికాయ దొంగల్లా కాకుండా గమ్మునుంటారో చూడాలి. 

More Related Stories