English   

ది ల‌య‌న్ కింగ్  రివ్యూ 

The lion king review
2019-07-19 11:09:14

వాల్ట్ డిస్నీ నుంచి వ‌స్తున్న సినిమా అంటే ఎలా ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. పైగా జంగిల్ బుక్ ద‌ర్శ‌కుడి నుంచి వ‌చ్చిన సినిమా అంటే అంచ‌నాలు కూడా భారీగానే ఉంటాయి. మ‌రి ఇప్పుడు ది ల‌య‌న్ కింగ్ అంచ‌నాలు అందుకుందా లేదా..? 

కథ :

ముఫాస అడవికి రాజు. ఆయ‌న‌కు స్కార్ అనే త‌మ్ముడుంటాడు. ఎప్పుడూ అన్న రాజ్యంపై క‌న్నేసి ఉంటాడు. ఆయ‌న సింహాస‌నం ద‌క్కించుకోవాల‌ని చూస్తుంటాడు. కానీ ముఫాస మాత్రం త‌ర్వాత రాజుగా కొడుకు సింహం సింబాను ప్ర‌క‌టిస్తాడు. కానీ అలా ప్ర‌క‌టించిన కొన్ని రోజుల‌కే ముఫాస చ‌నిపోతాడు. దాంత వెంట‌నే స్కార్ రెచ్చిపోతాడు. త‌మ రాజ్య‌పు శ‌త్రువులైన హైనాల‌తో చేతులు క‌లిపి అడ‌విని ముట్ట‌డిస్తాడు స్కార్. సింబా భ‌యంతో రాజ్యం నుంచి పారిపోతాడు. ఆ త‌ర్వాత మ‌ళ్లీ సింబా ఎలా వ‌చ్చాడు.. ఎప్పుడొచ్చాడు.. రాజ్యాన్ని ఎలా కాపాడాడు అనేది క‌థ‌.. 

క‌థ‌నం:

కొన్ని సినిమాల‌కు క‌థ ఎలా ఉంద‌ని అడ‌క్కూడ‌దు. ది ల‌య‌న్ కింగ్ కూడా అంతే. ఈ చిత్రంలో తెలియ‌ని క‌థ అంటూ ఏం లేదు. అన్న రాజ్యం కోసం కుట్ర‌లు ప‌న్నే త‌మ్ముడు క‌థ ఇది. అన్న‌ను చంపేసి ఆ రాజ్యాన్ని తీసుకున్న త‌మ్ముడికి వార‌సుడు వ‌చ్చి ఎలా బుద్ధి చెప్పాడు అనేది క‌థ‌.. ఇలాంటి క‌థ‌ల‌తో చాలా సినిమాలు చూసాం. మ‌న బాహుబ‌లి కూడా ఇలాంటి క‌థే. కానీ విజువ‌ల్ వండ‌ర్ గా ది ల‌య‌న్ కింగ్ కు ఎలాంటి పేరు పెట్ట‌లేం. తెర‌పై జ‌రిగే అద్భుతాన్ని చూసి తీరాల్సిందే. ఒక్కో సీన్ వ‌స్తుంటే అద్భుత‌మే అనిపిస్తుంది. ఎమోష‌న‌ల్ సీన్స్ కూడా ఈ చిత్రంలో ఉన్నాయి. జంతువులే అయినా కూడా కొన్ని సీన్స్ చాలా అద్భుతంగా తెర‌కెక్కించాడు ద‌ర్శ‌కుడు జోన్ ఫావ్రియూ. జంగిల్ బుక్ రేంజ్ కాదు కానీ చూసినంత సేపు ఎంగేజ్ అవుతారు ప్రేక్ష‌కులు. స్క్రీన్ ప్లే వీక్ అనిపించినా కూడా విజువ‌ల్ తో అన్నీ మ‌రిచిపోతారు. తెలుగులో చూసే వాళ్ల‌కు నాని, జ‌గ‌ప‌తిబాబు, ర‌విశంక‌ర్, బ్ర‌హ్మానందం, అలీ, షేకింగ్ శేషు లాంటి వాళ్ళ వాయిస్ సినిమాకు అద‌న‌పు ఆక‌ర్ష‌ణ‌.

టెక్నిక‌ల్ టీం:

ఈ సినిమాలో న‌టులుండ‌రు. అంతా జంతువులే. వాటి కోసం విజువ‌ల్ ట్రీట్ వాడుకున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. ఒక్కో సీన్ వ‌స్తుంటే అబ్బో అని నోరెళ్ల‌బెట్టాల్సిందే. అంత‌గా విఎఫ్ఎక్స్ మాయాజాలం ఈ సినిమాలో ఉంది. దానికితోడు రెండు గంట‌ల సినిమానే కాబ‌ట్టి బోర్ కూడా కొట్ట‌దు. అంతా జంతువులే ఉంటాయి.. 3డిలో చూస్తుంటే వాటి మ‌ధ్యే మ‌న ప్ర‌యాణం సాగుతుంది. ఎడిటింగ్, సినిమాటోగ్ర‌పీ, ద‌ర్శ‌కత్వం అన్నీ మ‌రో స్థాయిలో ఉన్నాయి. 
 
చివ‌ర‌గా: ది ల‌య‌న్ కింగ్.. గో అండ్ ఎంజాయ్ విత్ యువర్ ఫ్యామిలీ..

రేటింగ్ : 3 /5.

More Related Stories