English   

మళ్లీ థియేటర్స్ కు కళ 

Theaters-release

మళ్లీ రేపటి నుంచి థియేటర్స్ కళకళలాడబోతున్నాయి. ఈ నెలలో జరిగిన థియేటర్స్ బంద్ తో కొంత ఇబ్బంది పడ్డా.. రేపటి నుంచి మళ్లీ రెగ్యులర్ జోష్ కనిపించబోతోంది. అందుకు తగ్గట్టుగానే రేపు ఏకంగా నాలుగు సినిమాలు విడుదల కాబోతున్నాయి. వీటిలో రెండు డబ్బింగ్ సినిమాలూ ఉన్నాయి. రెండు స్ట్రెయిట్ మూవీస్. ఇప్పటికే ఇంటర్ ఎగ్జామ్స్ అయిపోయాయి. కానీ డిగ్రీ పరీక్షలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో సమ్మర్ సినిమాలకు కొత్త జోష్ రావడానికి కొంత టైమ్ పడుతుంది. అందుకే సమ్మర్ వార్ ను ఈ నాలుగు సినిమాలు పెట్టాయనుకోలేం. అది నెక్ట్స్ వీక్ నుంచి, లేదంటే రంగస్థలం నుంచి మొదలు కావొచ్చు. కానీ థియేటర్స్ బంద్ తర్వాత ఒకే రోజు నాలుగు సినిమాలు వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా కొత్త కళ కనిపిస్తుంది. 

నిఖిల్ హీరోగా కిరాక్ పార్టీ రేపు విడుదలవుతోంది. కన్నడ బ్లాక్ బస్టర్ కిరిక్ పార్టీకి రీమేక్ ఇది. ఇక దశాబ్ధంన్నర క్రితమే ‘ఐతే’అన్ని సినిమాలూ ఒకలా ఉండవు అంటూ వచ్చిన సినిమా చాలామందికి గుర్తు ఉండే ఉంటుంది. ఆ సినిమాకు సీక్వెల్ అనొచ్చో లేదో కానీ.. ఆ టైటిల్ తోనే మరో  సినిమా ఐతే 2.0 అంటూ రేపో సినిమా వస్తోంది. ఇవి కాక లేడీ సూపర్ స్టార్ నయనతార నటించిన తమిళ సినిమా ఆరమ్ ను తెలుగులో కర్త్యవంగా డబ్ చేశారు. ఆల్రెడీ తమిళంలో ఇది అద్భుతం అనే పేరు తెచ్చుకుంది. విమర్శకుల నుంచి అద్భుత స్పందన సంపాదించింది. తెలుగులో ప్రీమియర్స్ చూసిన వారు కూడా అద్భుతం అనేస్తున్నారు. ఇక రెండు భాగాలతో కలెక్షన్లు దండుకున్న దండుపాళ్యం కు మూడో భాగం కూడా రేపే విడుదలవుతోంది. దండుపాళ్యం -3గా ఈ సిరీస్ లో చివరి సినిమాగా వస్తోన్న ఈ మూవీ పైనా మంచి అంచనాలే ఉన్నాయి. మరి ఈ నాలుగు సినిమాల్లో బాక్సాఫీస్ విన్నర్ ఎవరో కానీ మొత్తంగా థియేటర్స్ వద్ద మళ్లీ సందడి మొదలైనట్టే. 

More Related Stories