English   

థియేట‌ర్స్ పై నిర్మాత‌ల ప‌ట్టు, డిఎస్పీల బెట్టు

Theaters- bandh

థియేట‌ర్స్ బంద్ మూడోరోజూ సంపూర్ణంగా జ‌రిగింది. అయితే ఒక‌వైపు బంద్ తో పాటు మ‌రోవైపు బంద్ విరమ‌ణ కోసం చ‌ర్చ‌లు కూడా కొన‌సాగుతున్నాయి. మొద‌టి రోజే ఓ కొలిక్కి వ‌చ్చాయ‌నుకున్న చ‌ర్చ‌లు ఒక‌ర‌క‌మైన బెట్టుతో పొడిగించ‌బ‌డ్డాయి. ఇప్ప‌టి వ‌ర‌కూ వ‌సూలు చేస్తోన్న వ‌ర్చువ‌ల్ ప్రింట్ ఫీజ్ నుంచి 25శాతం త‌గ్గించాల‌నేది ఫిల్మ్ చాంబ‌ర్ చేస్తోన్న ప్ర‌ధాన డిమాండ్. దీనికి డిజ‌ట‌ల్ స‌ర్వీస్ ప్రొవైడ‌ర్స్ నుంచి సానుకూల స్పంద‌న వ‌చ్చింది. కానీ వాళ్లు కేవ‌లం 23శాతం మాత్ర‌మే త‌గ్గిస్తామంటున్నారు. 23శాతానికి నిర్మాత‌లు ఒప్పుకోవ‌డం లేదు. ఈ మాట ద‌గ్గ‌రే ఇప్పుడు బంద్ కొన‌సాగాలా వ‌ద్దా అనే సంశ‌యం కంటిన్యూ అవుతోంది. ఇంకా త‌గ్గించాల‌ని థియేట‌ర్స్ ఓన‌ర్స్, డిస్ట్రిబ్యూట‌ర్స్ ప‌ట్టు బ‌డుతున్నారు. ఇంత‌కంటే త‌గ్గించ‌లేద‌ని డిజిట‌ల్ స‌ర్వీస్ ప్రొవైడ‌ర్స్ బెట్టు చేస్తున్నారు. అయితే ఇప్ప‌టి వ‌ర‌కూ వినిపిస్తోన్న వార్త‌ల ప్ర‌కారం 23శాతానికే బంద్ విర‌మ‌ణ  ప్ర‌క‌ట‌న వ‌చ్చే అవ‌కాశం ఉంది. అలాగే కొత్త‌గా కొన్ని విధి విధానాల‌ను కూడా ఈ సంద‌ర్భంగా రూపొందించుకునే అవ‌కాశం ఉంది. ఇక‌పై ఇలాంటి స‌మ‌స్య‌లు రాకుండా ఇప్పుడే ఖ‌చ్చిత‌మైన విధానాలూ రూపొంచుకుంటే భ‌విష్య‌త్ లో మ‌ళ్లీ ఇలాంటి ప్రాబ్ల‌మ్స్ రావు. ఏదేమైనా మూడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల‌తో పాటు త‌మిళ‌నాడు, కేర‌ళ‌లో కూడా థియేట‌ర్స్ బంద్ స‌క్స‌స్ అయిన‌ట్టే. 

More Related Stories